వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని ఏ విధంగా నిర్మించుకోవాలి.. ఏ విధంగా వస్తువులు ఏర్పాటు చేసుకోవాలి అని ఆలోచిస్తారు. అదే విధంగా ఇంట్లోని మెట్ల నిర్మాణం విషయంలో మాత్రమే కాదు మెట్ల కింద ఉన్న పెట్టే వస్తువుల విషయంలో కూడా వాస్తుని పాటించాలి. ఎందుకంటే మెట్ల కింద్ర ప్రాంతంలో ప్రతికూల శక్తి ఉంటుంది. కనుక కొన్ని వస్తువులను అక్కడ ఉంచకూడదు. ఎందుకంటే అది ప్రతికూల ప్రభావాన్ని చూపించే స్థలం.. కనుక కొన్ని రకాల వస్తువులు పెట్టడం వలన సమస్యలు కలుగుతాయి.
ప్రస్తుతం ఇంటి నిర్మించుకునే స్థలం తక్కువగా ఉంటుంది. దీంతో ప్రతి ఇంట్లోని స్థలాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. తరచుగా మెట్ల కింద ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా ఏదోక విధంగా ఉపయోగించాలని కోరుకుంటారు. ఖాళీ స్థలం ఉంటే..దానిని ఖచ్చితంగా ఉపయోగించాలి. ..అయితే అదే సమయంలో వాస్తు ప్రకారం మాత్రమే ఖాళీ స్థలాన్ని ఉపయోగించాలి. ఇక ఇంట్లోని మెట్ల కింద ఉన్న ఖాళీ స్థలం గురించి.. ఏ వస్తువులు పెట్టకూడదు.. ఏ వస్తువులు పెట్టాలి తెలుసుకుందాం..
నిజానికి, మెట్లు వక్రంగా తయారు చేయబడతాయి. దీని కారణంగా మెట్ల కింద శక్తి అస్తవ్యస్తంగా మారుతుంది. ప్రతికూలతతో నిండి ఉంటుంది. అందువల్ల కొన్ని వస్తువులను మెట్ల కింద ఉంచకూడదు. ఈ నేపధ్యంలో ఏ వస్తువులను మెట్ల కింద ఉంచకూడదు? ఏ వస్తువులను అక్కడ ఉంచవచ్చంటే..
పెంపుడు జంతువులు ఉంచేందుకు స్థలం.
మెట్ల కింద ఉన్న స్థలాన్ని పెంపుడు జంతువులను ఉంచడానికి ఉపయోగించకూడదు. అక్కడ ఉన్న ప్రతికూల శక్తి పెంపుడు జంతువు పై ప్రభావం చూపిస్తుంది. పెంపుడు జంతువు సమతుల్యతను దెబ్బతీస్తుంది. అది మానసికంగా చెదిరిపోవచ్చు. అప్పుడు ప్రవర్తన దూకుడుగా మారవచ్చు. లేదా ఆ జంతువు అనారోగ్యానికి గురి కావచ్చు. కనుక ఇలా చేయవద్దు.
స్టడీ స్పేస్‌గా చేయవద్దు
మెట్ల కింద ఉన్న ఖాళీ స్థలాన్ని స్టడీ టేబుల్ వేసి స్టడీ స్పేస్‌గా ఉపయోగించవద్దు. ఇలా చేస్తే అక్కడ కుర్చుని చదువుకునే పిల్లలు తమ చదువుపై దృష్టి పెట్టలేడు. అలాగే పిల్లల ఏకాగ్రతపై ప్రభావం చూపిస్తుంది.
పూజా గదిని వద్దు
మెట్లపై తమ పాదాలను ఉంచి నడుస్తారు. ఈ నేపధ్యంలో మెట్ల కింద పూజా స్థలం లేదా దేవుడి పూజ కోసం ఉపయోగించడం అంటే మీరు దేవుడిపై అడుగు పెడుతున్నారని అర్థం. దీని ప్రతికూల ప్రభావం ఆ ఇంట్లో కనిపించడం ప్రారంభమవుతుంది. అనేక రకాల సమస్యలు రావచ్చు.
డబ్బు పెట్టుకునే సేఫ్ లాకర్
వాస్తవానికి సేఫ్ లాకర్ సంపదల దేవత లక్ష్మీదేవి, కుబేరులకు సంబంధించినది. కనుక సేఫ్ లాకర్ ను మెట్ల కింద ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇంట్లో డబ్బు ఆదా చేసే ప్రయత్నం తగ్గుతుంది. అధిక ఖర్చులు చేయాల్సి ఉంటుంది.
మెట్ల కింద ఏమి ఉంచాలంటే
మెట్ల కింద స్థలాన్ని ఖాళీగా ఉంచడం మంచిది. అయితే ఎవరైనా ఆ స్థలాన్ని ఉపయోగించాలనుకుంటే.. దానిని స్టోర్ రూమ్‌గా ఉపయోగించవచ్చు. దీనితో పాటు ఆ స్థలాన్ని బూట్లు ఉంచడానికి ఒక రాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీనితో పాటు అప్పుడప్పుడు ఉపయోగించే పాత్రలు మొదలైన వాటిని ఉంచడానికి ఈ స్థలాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ ప్రదేశంలో చిన్న చిన్న మొక్కలున్న కుండీలను పెంచుకోవచ్చు. ఇలాంటి చర్యలు ఇంటి లోపలి భాగంలో శక్తి మెరుగుపడుతుంది.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.
































