పాలల్లో ఎన్ని రకాలున్నాయో తెలుసా..! వాటిల్లో ఏఏ విటమిన్లు ఉన్నాయంటే

www.mannamweb.com


అనేక రకాల పాలు ఒకేలా కనిపిస్తాయి కానీ వాటి పోషణలో చాలా తేడా ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ శరీరాన్ని బట్టి పాలను తీసుకోవాలి. ఈ రోజు పాలు ఎన్ని రకాలు, ఏ పాలు ఎవరికి మంచివో తెలుసుకుందాం..

ఆవు పాలు: పిల్లలకు మాత్రమే కాదు చాలా మంది ఆవు పాలను తీసుకుంటారు. ఆవు పాలు ప్రోటీన్ ఉత్తమ మూలంగా పరిగణించబడుతుంది. హెల్త్‌లైన్ ప్రకారం 240 ml పాలలో 149 కేలరీలు, 8 గ్రాముల ప్రోటీన్, కొవ్వు, 12 గ్రాముల పిండి పదార్థాలు, 24% విటమిన్ D, 28% కాల్షియం, 26% రిబోఫ్లావిన్, 22% ఫాస్పరస్, 18% విటమిన్ B12, 13% సెలీనియం, 10% పొటాషియం లభిస్తుంది.

సోయా పాలు: సోయా పాలు కూడా ప్రోటీన్ మంచి మూలకం. అంతేకాదు సోయా పాలల్లో 105 కేలరీలు, 6 గ్రాముల ప్రోటీన్, 12 గ్రాముల పిండి పదార్థాలు, 4 గ్రాముల కొవ్వు, 34% విటమిన్ B12, 30% కాల్షియం, 26% రైబోఫ్లేవిన్, 26% విటమిన్ D, 10% ఫాస్పరస్ ఉన్నాయి.

వోట్స్ పాలు: ఈ వోట్ మిల్క్ లో 240-మి.లీ సర్వింగ్‌లో 120 కేలరీలు, 3 గ్రా ప్రోటీన్, 16 గ్రా పిండి పదార్థాలు, 2 గ్రా ఫైబర్, 5 గ్రా కొవ్వు, 50% విటమిన్ బి12, 46% రిబోఫ్లావిన్, 27% కాల్షియం, 22% ఫాస్పరస్, 18% విటమిన్ డి, A వంటి విటమిన్ పోషకాలు లభిస్తాయి.

మేక పాలు: మేక పాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తారు. హెల్త్‌లైన్ ప్రకారం ఒక కప్పు పచ్చి మేక పాలలో 146 కేలరీలు, 8 గ్రాముల ప్రోటీన్, 7.81 గ్రాముల కొవ్వు, 11.4 గ్రాముల ఇనుము, 23% కాల్షియం, 8% పొటాషియం, 26% విటమిన్ B2 మరియు 55% విటమిన్ B12 ఉన్నాయి.

A2 పాలు: A2 పాలు అనేది ఒక రకమైన దేశీ గిరి ఆవు పాలు. ఈ పాలల్లో A2 ప్రోటీన్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఈ పాలు A2 ప్రొటీన్‌ను మాత్రమే ఉత్పత్తి చేసే ఆవుల నుండి వస్తుంది. A1 ప్రోటీన్‌ ఈ పాలల్లో ఉండదు. అయితే ఆవు పాలకు అలెర్జీ ఉన్న వ్యక్తులు.. ఈ రకమైన పాలకు దూరంగా ఉండాలి.

బాదం పాలు: బాదంపప్పును నీళ్లలో నానబెట్టి మిక్సీ చేసి వడగట్టి బాదం పాలను తయారుచేస్తారు. హెల్త్‌లైన్ ప్రకారం ఈ 240-మి.లీ పాలలో 41 కేలరీలు, 1 గ్రాము ప్రోటీన్, 2 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల కొవ్వు, 50% విటమిన్ ఇ ఉన్నాయి. పాడి పాలు లేదా ఆవు పాలు అలెర్జీ ఉన్న వ్యక్తులకు ఈ బాదాం పాలు అనుకూలంగా ఉండవచ్చు. అయితే బాదం గింజలు అంటే అలెర్జీ ఉన్నవారు ఈ పాలను తీసుకోకుండా ఉండాలి.