యూజర్ల కోసం వాట్సాప్ అనేక ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే మెటా ఏఐతో అనేక అప్డేట్స్ ని తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మెటా ఏఐతో మరింత సులువుగా కమ్యూనికేట్ అయ్యేలా సరికొత్త ఫీచర్ ని డెవలప్ చేస్తుంది. ఈ ఫీచర్ తో ఉద్యోగులకి భారీ ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగులకు మాత్రమే కాదు.. సాధారణ యూజర్స్ కి కూడా దీని వల్ల భారీ ప్రయోజనం చేకూరనుంది. మామూలుగా వాట్సాప్ లో టెక్స్ట్ ని టైప్ చేసి పంపించాలంటే కష్టంగా ఉంటుంది. కీబోర్డ్ చిన్నగా ఉండడం వల్ల అక్షరాలు మిస్టేక్ పడిపోతుంటాయి. దీని వల్ల చాటింగ్ అంటేనే చిరాకు పుడుతుంది. అయితే ఈ ఫీచర్ తో ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. వాట్సాప్ ఇప్పుడు స్పీచ్ టూ టెక్స్ట్ కన్వర్షన్ ఫీచర్ ని డెవలప్ చేస్తుంది. అంటే మనం మాట్లాడే మాటలను టెక్స్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. మెటా ఏఐ చాట్ బాట్ తో ఈ స్పీచ్ టూ టెక్స్ట్ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
వినికిడి లోపం ఉన్నవారికి, వినడం కంటే చదివేందుకు ప్రాధాన్యత ఇచ్చేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. టెక్స్ట్ టైప్ చేయడం బదులు కొంతమంది వాయిస్ రికార్డ్ చేసి పంపుతారు. అయితే ఆ వాయిస్ అవతల వారికి అర్థం కాకపోవచ్చు. ట్రాఫిక్ సౌండ్ లో వినబడకపోవచ్చు. అలాంటప్పుడు మీరు మెటా ఏఐలో మీ వాయిస్ ని రికార్డ్ చేసి దాన్ని టెక్స్ట్ గా కన్వర్ట్ చేసి ఇవ్వమని అడిగితే ఇస్తుంది. అలానే మీకు కొన్ని ఐడియాస్ వస్తాయి. వాటిని రాసుకుంటే ఈజీగా చదవడానికి బాగుంటుందని అనిపిస్తుంది. కానీ చదవడానికి ఉన్న ఓపిక రాయడానికి ఎవరికీ ఉండదు. అందుకే వాయిస్ రికార్డ్ చేస్తుంటారు. అయితే స్పీచ్ టూ టెక్స్ట్ ఫీచర్ తో మీరు మీ ఐడియాస్ ని రికార్డ్ చేయడంతో పాటు టెక్స్ట్ కింద సేవ్ చేసుకోవచ్చు
వాట్సాప్ ప్రస్తుతం మెటా ఏఐతో వాయిస్ తో కమ్యూనికేట్ అయ్యేందుకు వాయిస్ చాట్ మోడ్ ఫీచర్ మీద పని చేస్తుంది. ఈ ఫీచర్ తో యూజర్లు మరింత సులువుగా, సహజమైన భాషలో మెటా ఏఐతో కమ్యూనికేట్ అవ్వచ్చు. రియల్ టైం వాయిస్ సంభాషణలతో, వేగంగా మెటా ఏఐతో కమ్యూనికేషన్ జరపవచ్చు. దీని వల్ల చాలా సమయం ఆదా అవుతుంది. క్యాప్షన్స్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్ ని ఎనేబుల్ చేసుకుంటే స్పీచ్ నుంచి టెక్స్ట్ కి మీ వాయిస్ కన్వర్ట్ అవుతుంది. ఇందులో స్పీచ్ అవుట్ పుట్ ని ఆఫ్ చేసుకోవచ్చు. ఫుల్ పెట్టుకోవచ్చు లేదా బ్రీఫ్ పెట్టుకోవచ్చు. ఐఓఎస్ కోసం వాట్సాప్ బీటాలో డెవలపింగ్ దశలో ఉంది. అయితే ఆండ్రాయిడ్ 2.24.17.3 వాట్సాప్ బీటా వెర్షన్ లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. యూజర్స్ అందరికీ ఫ్యూచర్ అప్డేట్ లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ ఉద్యోగులకు బాగా ఉపయోగపడుతుంది. కంటెంట్ ని తయారు చేసే ఉద్యోగులకు బాగా హెల్ప్ అవుతుంది.