కారు టైర్లను ఎప్పుడు మార్చాలి? ఈ చిన్న తప్పు మీ ప్రాణాలకు ముప్పు!

మీ కారుకు సంబంధించిన భద్రత, పనితీరులో కారు టైర్లు కీలక పాత్ర పోషిస్తాయి. రోడ్డుతో నిరంతరం సంబంధం కలిగి ఉండే ఈ టైర్లు అరిగిపోయినా లేదా పాతబడినా, రోడ్డుపై వాటి పట్టు తగ్గి ముఖ్యంగా తడి వాతావరణంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగే అవకాశం పెరుగుతుంది. అందుకే సురక్షితమైన, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం కోసం ప్రతి డ్రైవర్ తమ కారు టైర్లను ఒక నిర్ణీత సమయం, దూరం తర్వాత మార్చవలసిని అవసరాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కొత్తగా కారు కొనుగోలు చేసిన వారికి లేదా దీనిపై అవగాహన లేని వారికి టైర్లను మార్చడానికి సరైన సమయం ఎప్పుడు అనేది ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.


ఎన్ని కిలోమీటర్లు నడిపిన తర్వాత టైర్లు మార్చాలి? కారు టైర్లను ఎన్ని కిలోమీటర్లు నడిపిన తర్వాత మార్చాలనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు. ఎందుకంటే ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ టైర్ నిపుణులు, తయారీదారులు సాధారణంగా 40,000 నుంచి 50,000 కిలోమీటర్ల మధ్య కారు నడిపిన తర్వాత టైర్లను మార్చాలని సిఫార్సు చేస్తారు. అయితే ఈ సిఫార్సు కేవలం మార్గదర్శకత్వం మాత్రమే. మీ డ్రైవింగ్ అలవాట్లు, మీరు ప్రయాణించే రోడ్డు పరిస్థితి, మీరు ఉపయోగిస్తున్న టైర్ నాణ్యత వంటి అంశాలు టైర్ జీవితకాలానని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు అధిక నాణ్యత గల టైర్లు లేదా మెరుగైన రోడ్లపై డ్రైవింగ్ చేసే వారికి 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం కూడా టైర్లు మన్నికను ఇవ్వవచ్చు.

టైర్లు త్వరగా అరిగిపోవడానికి గల కారణాలు టైర్లు త్వరగా అరిగిపోవడానికి ప్రధాన కారణం ర్యాష్ డ్రైవింగ్. అధిక వేగంతో కారు నడపడం, ముఖ్యంగా తరచుగా అకస్మాత్తుగా బ్రేకులు వేయడం లేదా మూల మలుపుల వద్ద వేగాన్ని తగ్గించకపోవడం వల్ల టైర్లపై అదనపు ఒత్తిడి పడి త్వరగా అరిగిపోతాయి. దీనితో పాటు మీరు తరచుగా గుంతలు పడిన లేదా ఎగుడుదిగుడుగా ఉన్న (ఖరాబైన) రోడ్లపై డ్రైవ్ చేస్తుంటే టైర్ల జీవితకాలం వేగంగా తగ్గుతుంది. దీనికి విరుద్ధంగా హైవేలు లేదా మృదువైన రోడ్లపై డ్రైవ్ చేస్తే టైర్లు సాపేక్షంగా ఎక్కువ కాలం మన్నుతాయి. టైర్లలో సరైన గాలి ఒత్తిడి (ప్రెషర్) లేకపోవడం కూడా త్వరగా అరిగిపోవడానికి మరో ప్రధాన కారణం.

కిలోమీటర్లతో సంబంధం లేకుండా టైర్ల వయస్సు ముఖ్యం టైర్లను మార్చడానికి కేవలం కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రమాణం కాదు. టైర్ల వయస్సుపై కూడా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. మీరు మీ కారును తక్కువగా నడిపినా 40-50 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకోకపోయినా, టైర్లను మార్చవలసిన సమయం రావచ్చు. సాధారణంగా కారు టైర్ల గరిష్ట జీవితకాలం 4 నుంచి 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఈ సమయ పరిమితి తర్వాత టైర్లలోని రబ్బరు పాతబడి, గట్టిపడి, ఉపరితలంపై పగుళ్లు ఏర్పడవచ్చు. ఈ పగుళ్లు కనిపించకపోయినా రబ్బరు దాని పట్టు శక్తిని కోల్పోతుంది. ఇది రోడ్డుపై పట్టును బలహీనపరుస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇది చాలా ప్రమాదకరం. అకస్మాత్తుగా టైరు పేలిపోయే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి భద్రత దృష్ట్యా కిలోమీటర్లతో పాటు టైర్ల వయస్సును కూడా తప్పకుండా లెక్కించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.