రాష్ట్ర గీతం రెడీ.. విడుదల ఎప్పుడంటే..?

తెలంగాణ రాష్ట్ర గీతంపై (Telangana Geetham) ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. జూన్ 2వ తేదీన ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీతో (Sonia Gandhi) ఈ గీతాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధం అవుతోంది. సినీ సంగీత దర్శకుడు కీరవాణితో ఈ పాటను రేవంత్ ప్రభుత్వం కంపోజింగ్ చేయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న.. ఇంతవరకు రాష్ట్రం గీతం లేకుండేది. గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.


రాష్ట్ర గీతంలో మార్పులు

తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర గీతం ఉండాలని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతంలో అందెశ్రీ రాసిన రాష్ట్ర గీతాన్ని అమోదిస్తూ కేబినెట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఈ గీతాన్ని రచించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగానే ఆ గీతం రాసిన అందెశ్రీకి కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం సూచించింది. అందులో భాగంగా అందెశ్రీ ఈ గీతంలో మార్పులు చేసి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం అమోదముద్ర వేసింది. ఆ గీతాన్ని సినీ సంగీత దర్శకుడు కీరవాణితో కంపోజింగ్ చేశారు. జూన్2న రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో.. ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది.