ఏ సీజన్‌లో ఏ పాత్రలో నీరు తాగాలి.. మన ఆరోగ్యానికి ఏది మంచిది

క మనిషి జీవించాలంటే గాలి ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. నీటిని సరిగ్గా తీసుకోకపోతే మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే వైద్యులు నీటిని సరిగ్గా తాగమని సలహా ఇస్తారు.


అయితే కొన్ని సార్లు మనం తాగే నీటి నుంచి మన శరీరానికి అందే ప్రయోజనాలు వాటిని నిల్వ చేసే పాత్రలను బట్టి మారుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగి, స్టీల్, ప్లాస్టిక్‌ ఇలా ఒక్కోరకం పాత్రంలో నిల్వ ఉంచిన నీరు ఒక్కో ప్రయోజనాలను కలిగి ఉంటాయట.కాబట్టి ఏ కాలంలో ఏ పాత్రలో నీరు తాగడం ఉత్తమం, వాటి వల్ల మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటనేవి ఇక్కడ తెలుసుకుందాం.

వేసవిలో కుండలో నింపిన నీరు

వేసవికాలంలో ప్రతి ఒక్కరి వేడి నుంచి ఉపసమనం పొందడం కోసం చల్లని నీరు తాగాలని ఉంటుంది. కాబట్టి చాలా మంది ఫ్రిజ్‌లో ఉంచి నీరు తాగడానికి ఇష్టపడతారు. కానీ ఇది కొన్ని సార్లు శరీరానికి హానికరం కావచ్చు. అలా కాకుండా మట్టి పాత్ర నుండి నీరు త్రాగడం మన ఆరోగ్యానికి మంచి ఎంపిక. ఇది నీటిని సహజంగా చల్ల బర్చడమే కాకుండా ఇందులో ఉండే ఖనిజాలు నీటి నాణ్యతను పెంచడానికి తోల్పడుతాయి. ఉదయం ఈ పాత్రల్లో వేడి చేసి గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల శరీరంలో ఉన్న విషం తొలగిపోతుంది. అలాగే బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఇది ముఖానికి సహజమైన మెరుపును కూడా తెస్తుంది.

శీతాకాలంలో బంగారు నీటి కుండ

శీతాకాలంలో చాలా మంది చలి నుంచి ఉపసమనం పొందేందుకు వేడి గోరు వెచ్చని నీరు తాగడానికి ఇష్టపడుతారు. ఈ సమయంలో బంగారు పాత్రలో నీరు త్రాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. బంగారు పాత్ర లేకపోతే, మీరు మరే ఇతర పాత్రలోనైనా నీరు త్రాగవచ్చు. కానీ మీరు బంగారు ఉంగరం వంటి బంగారు వస్తువులతో త్రాగాలి. ఈ నీరు నిరాశ, నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది దగ్గు, జలుబు, జ్వరం వంటి కాలానుగుణ వ్యాధుల నుండి కూడా మీకు ఉపశమనం కలిగిస్తుంది.

వర్షాకాలంలో రాగి పాత్రలో నీరు

వర్షాకాలంలో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో రాగి పాత్రలో నిల్వ ఉంచి నీరు త్రాగడం మనకు ఎంతో ఆరోగ్యకరమైనది. అదనంగా, రాగి నీటిని తాగడం ద్వారా మన శరీరంలో ఉన్నా హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి మనను ఆయా రోగాలు రాకుండా కాపాడుతాయి. అలాగే ఈ పాత్రలో నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.