White Hair : మందార పువ్వులో ఈ నూనె కలిపి పెడితే.. తెల్ల జుట్టు నల్లగా అవుతుంది

మందార పువ్వు మన జుట్టుకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ మందార పువ్వు పొడిలో ఒక నూనెను కలిపి పెడితే తెల్ల జుట్టు నల్లగా అవుతుంది. చిన్న వయసులో తెల్ల జుట్టు వచ్చే సమస్యే ఉండదు.


అబ్బాయిలైతే జుట్టు ఊడిపోకుండా, ఒత్తుగా ఉండాలని కోరుకుంటే.. అమ్మాయిలు పొడుగ్గా, మందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల ఈ రోజుల్లో చాలా మందికి హెయిర్ ఫాల్ తో పాటుగా చుండ్రు వంటి రకరకాల జుట్టుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. కానీ ఎప్పుడూ జుట్టు రాలడం వల్ల మగవారికి బట్టతల, ఆడవారికి నెత్తిపల్చగా అవుతుంది. వీటికి తోడు చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తోంది. ఇది అందాన్ని పాడు చేస్తుంది. అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే రెండు వస్తువులతో జుట్టు రాలకుండా చేయొచ్చు. అలాగే ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. అంతేకాదు తెల్ల వెంట్రుకలు కూడా రావు. ఇందుకోసం జుట్టుకు ఏం పెట్టాలంటే?

మందార పువ్వు – ఆవ నూనె హెయిర్ మాస్క్ ప్రయోజనాలు

మందార పువ్వు, ఆవ నూనెను కలిపి పెట్టడం వల్ల ఎన్నో జుట్టుకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఇది తెగిపోయిన జుట్టు మళ్లీ పెరిగేలా చేస్తుంది. అలాగే పొట్టిగా ఉన్న జుట్టు పొడుగ్గా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టును బలంగా చేస్తుంది. ఈ హెయిర్ మాస్క్ ను ఉపయోగించడం వల్ల మీ జుట్టు స్మూత్ గా, మంచి షైనీగా ఉంటుంది. అలాగే నెత్తిమీద చుండ్రు లేకుండా చేస్తుంది. నెత్తి పొడిబారకుండా చేయడానికి కూడా సహాయపడుతుంది.

మందారం, ఆవ నూనెతో హెయిర్ మాస్క్ ను ఎలా తయారు చేయాలి?

ఇందుకోసం 5 నుంచి 6 తాజా మందార పువ్వులను తీసుకోండి. అలాగే రెండు నుంచి మూడు టీ స్పూన్ల ఆవ నూనెను తీసుకోండి. ముందుగా మందార పువ్వులను కడిగి మెత్తగా గ్రైండ్ చేయండి. దీనిలో ఆవ నూనెను కొంచెం వేడి చేసి పేస్ట్ లో కలపండి. దీన్ని నేరుగా మీ జుట్టు మొత్తానికి బాగా పట్టించండి. 30-45 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లు, తేలికపాటి షాంపూతో వాష్ చేయండి.

తెల్ల జుట్టు నల్లగా కావడానికి ఏం చేయాలి?

ఆవనూనె – 100 గ్రాములు
జీడిపప్పు పొడి – 1
కాఫీ పొడి – 1 టీస్పూన్
నల్ల నువ్వులు – 1-1/2 టీస్పూన్
మెహందీ పొడి – 1/2 టీస్పూన్
మెంతి పొడి – 1-1/2 టీస్పూన్

జుట్టును నల్లగా మార్చే నూనెను ఎలా తయారు చేయాలి?

ముందుగా మిక్సీ తీసుకుని అందులో జీడిపప్పు, మెంతులు, నువ్వులు, కాఫీ పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఒక పాన్ ను వేడి చేసి అందులో ఆవనూనె వేసి బాగా మరిగించండి. దీనిలో అరటీస్పూన్ గోరింటాకు పొడి, గ్రైండ్ చేసిన వాటన్నింటినీ వేసి మళ్లీ మరిగించాలి. ఈ నూనె రంగు కొంచెం నలుపు రంగులోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. నూనె చల్లారిన తర్వాత గాజు సీసాలో నిల్వ చేయండి. ఈ నూనెను రోజూ వాడితే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఈ నూనెను వాడటం వల్ల జుట్టుకు మంచి పోషణ అందుతుంది. అలాగే జుట్టు నల్లగా, ఆరోగ్యంగా ఉంటుంది.

వారానికి ఎన్నిసార్లు వాడాలి?

ఈ హెయిర్ మాస్క్ ను వారానికి రెండు మూడు సార్లు వాడొచ్చు. దీన్ని మీరు రెగ్యులర్ గా గనుక వాడితే కొన్ని వారాల్లోనే తేడాను చూస్తారు. ఈ హెయిర్ మాస్క్ ను ఉపయోగించడం వల్ల మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగడం ప్రారంభమవుతుంది.

మందార పువ్వు ప్రయోజనాలు

మందార పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, రకరకాల ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీ జుట్టు పొడుగ్గా పెరగడానికి సహాయపడతాయి. మందారం జుట్టును బలంగా చేయడమే కాకుండా చుండ్రు లేకుండా చేస్తుంది

ఆవ నూనె ప్రయోజనాలు

ఆవనూనెను ఎన్నో ఏండ్ల నుంచి జుట్టుకు ఉపయోగిస్తున్నారు. అందుకే నేటికీ మన అమ్మలు, నానమ్మల జుట్టు తెల్లబడకుండా నల్లగా ఉంటుంది. ఈ ఆవనూనెలో ఒమేగా -3, విటమిన్లతో పాటుగా ఎన్నో రకాల పోషఖాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టును బలంగా ఉంచడానికి సహాయపడతాయి.