మిగిలిన హీరోలకు తలనొప్పిలా మారిపోతున్నారు ప్రభాస్. ప్రతీ ఏడాది ఈయన రావడం.. ఆ ఏడాదికి బిగ్గెస్ట్ ఓపెనింగ్ తీసుకురావడం కామన్ అయిపోయింది. 2024లోనూ కల్కితో అదే చేసారు ప్రభాస్.
మరి దీన్ని బీట్ చేసే ఏది..? విజయ్ గోట్ ఈ టెస్టులో ఫెయిలైంది. మరి లిస్టులో నెక్ట్స్ ఎవరు..? మిషన్ కల్కిని రీచ్ అయ్యేదెవరు.? ప్రభాస్ రేంజ్ ఏంటనేది బాక్సాఫీస్ లెక్కలే చెప్తున్నాయి.
మిగిలిన హీరోలకు తలనొప్పిలా మారిపోతున్నారు ప్రభాస్. ప్రతీ ఏడాది ఈయన రావడం.. ఆ ఏడాదికి బిగ్గెస్ట్ ఓపెనింగ్ తీసుకురావడం కామన్ అయిపోయింది. 2024లోనూ కల్కితో అదే చేసారు ప్రభాస్.
మరి దీన్ని బీట్ చేసే ఏది..? విజయ్ గోట్ ఈ టెస్టులో ఫెయిలైంది. మరి లిస్టులో నెక్ట్స్ ఎవరు..? మిషన్ కల్కిని రీచ్ అయ్యేదెవరు.? ప్రభాస్ రేంజ్ ఏంటనేది బాక్సాఫీస్ లెక్కలే చెప్తున్నాయి. అసలు సిసలైన ప్యాన్ ఇండియన్ హీరోగా నిలిచారు ప్రభాస్.
గతేడాది సలార్ 168 కోట్లు మొదటి రోజే వసూలు చేస్తే.. ఈసారి కల్కి 183 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ డే 146 కోట్లతో సలార్‌కి దగ్గరగా వచ్చి ఆగిపోయింది విజయ్ లియో. కానీ ఈ ఏడాది కల్కి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది అతడి గోట్.
విజయ్, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో వచ్చిన గోట్‌పై ముందు నుంచి అంచనాలు తక్కువగానే ఉన్నాయి. అయితే తమిళంలో మాత్రం సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా 125 కోట్లు వసూలు చేసి.. 2024లో కల్కి తర్వాత 100 కోట్ల ఓపెనింగ్ తెచ్చిన గా నిలిచింది గోట్.
దాంతో కల్కిని బీట్ చేసే ఛాన్స్ పుష్ప 2 ముందు నిలిచిందిప్పుడు. పుష్ప 2తో పాటు దేవర, గేమ్ ఛేంజర్ కూడా రేసులో ఉన్నాయి. కానీ ఫస్ట్ డే 185 కోట్లు వసూలు చేయాలంటే.. హిందీ నుంచి కనీసం తొలిరోజే వాటికి 40 కోట్లు రావాలి.
నార్త్ సర్కిల్స్‌లో ఈ రెండు లపై అన్ని అంచనాలు ఉన్నాయా అనేది ఆసక్తికరమే. కానీ పుష్ప 2 సంగతి వేరు.. తెలుగు కంటే హిందీలోనే ఈ కు ఓపెనింగ్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కల్కికి హిందీలో తొలి రోజే 25 కోట్లు వచ్చాయి.
తెలుగు, తమిళంతో పాటు ఓవర్సీస్‌లోనూ ఓపెనింగ్స్ అదిరిపోయాయి. పుష్ప 2కు ఇదే సీన్ రిపీట్ అయితే కల్కి రికార్డ్ గల్లంతే. పైగా బాహుబలి 2, RRR తర్వాత తొలిరోజే 200 కోట్లు వసూలు చేసిన లేం లేవు. ఆ రికార్డ్ కూడా పుష్ప 2ను ఊరిస్తుంది. మొత్తానికి చూడాలిక.. 2024లో కల్కిని కొట్టే మొనగాడెవరో..?