సినిమా షూటింగ్ లో క్లాప్ ఎందుకు కొడతారు..దాని ప్రాముఖ్యత ఏంటి..?

Why is there a clap in film shooting..what is its significance ..?


సినిమా షూటింగ్ లో క్లాప్ ఎందుకు కొడతారు..దాని ప్రాముఖ్యత ఏంటి..?

Why is there a clap in film shooting..what is its significance ..? సినిమా షూటింగ్ లో క్లాప్ ఎందుకు కొడతారు..దాని ప్రాముఖ్యత ఏంటి..?
సినిమా షూటింగ్ జరిగే టైంలో మనకు కొన్ని కామన్ మాటలు వినిపిస్తాయి. అవే యాక్షన్‌, కట్. యాక్షన్ అని చెప్పగానే సీన్ షూటింగ్ మొదలవుతుంది. కట్ అని చెప్పగానే ఆగిపోతుంది. వీటితో పాటు ఇంకో ప్రధానమైన విషయం క్లాప్ సౌండ్. ఒక సీన్ ప్రారంభం అయ్యే సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి క్లాప్ కొడతాడు. అసలు ఈ క్లాప్ ఎందుకు కొడతారు? దీని వలన మూవీ యూనిట్ కు జరిగే మేలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈ క్లాప్ బోర్డు అనేది చాలా కాలంగా ఉంది. సినిమాలు తీసేటప్పుడు కెమెరా సౌండ్ రికార్డు చేయదు. సీన్స్ షూట్ చేయడానికి కెమెరా.. సౌండ్ రికార్డు చేయడానికి ఇంకో పరికరం వాడుతారు. చాలా చోట్ల ఇదే విధానం కొనసాగుతుంది.

అందుకే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో సీన్ కు తగ్గట్లు సౌండ్ సింక్ చేయడానికి వీడియో ఎడిటర్స్ క్లాప్ టైమింగ్ చూసుకుంటారు.

క్లాప్ కొట్టిన వెంటనే వచ్చే డైలాగ్ చూసుకుని.. దానికి రికార్డు చేసిన వాయిస్ మిక్స్ చేస్తారు. అంతేకాదు.. సెట్స్ చాలా మంది ఉంటారు. క్లాప్ కొట్టిన వెంటనే సీన్ మొదలవుతుందని భావించి సైలెంట్ అవుతరు. నిజానికి సినిమాల్లో చూపించిన ఆర్డర్ లో సీన్స్ రికార్డు చేయరు. యాక్టర్ల డేట్స్, షూటింగ్ లొకేషన్ బట్టి షూటింగ్ కొనసాగుతుంది. ఫైనల్ గా సీన్స్ అన్నీ లైన్ గా పెడతారు. సీన్స్ ఆర్డర్ లో ఉండవు కాబట్టి, ఏ సీన్ ఎక్కడ రావాలో తెలియక వీడియో ఎడిటర్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే క్లాప్ బోర్డు మీద ప్రొడక్షన్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ తో పాటు స్క్రిప్ట్ తో సీన్ నెంబర్, టేక్ నెంబర్ కూడా రాస్తారు. ఈ పద్దతి మూలంగా మూవీ ఎడిటింగ్ ఈజీ అవుతుంది. షూటింగ్ సమయంలో క్లాప్ బోర్డుతో పాటు ఎండ్ బోర్డు కూడా వాడుతారు. ఆరోజు షూటింగ్ అయ్యాక షెడ్యూల్ లో సీన్స్ షూట్ అయిపోయిందనే దానికి గుర్తుగా క్లాప్ బోర్డును తిప్పి పట్టుకుంటారు. దాన్నే ఎండ్ బోర్డు అంటారు.