మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీడియా, హాస్పిటల్ మొదలు విమానయాన రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది.
ప్రపంచంలోని చాలా దేశాల్లో విమాన సేవలపై దీని ప్రభావం పడింది. విమాన సంస్థలు పలు సేవలను రద్దు చేశాయి కూడా. క్రౌడ్ స్ట్రైక్ అనే సెక్యూరిటీ అప్‌డేట్‌లో తలెత్తిన సమస్య కారణంగా కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించిన విషయం తెలిసిందే.
ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో సెక్యూరిటీ కోసం ఈ క్రౌడ్ స్ట్రైక్‌ను ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే అన్ని దేశాలపై ఈ ప్రభావం పడినా చైనాపై మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ దేశంలో విమాన రంగంపై కానీ మరే ఇతర రంగాలు ప్రభావితం అయినట్లు ఎలాంటి రాలేదు. దీంతో ప్రపంచమంతా ఊగిపోయిన తరుణంలో చైనాపై మాత్రం పెద్దగా కనిపించలేవు. దీనికి అసలు కారణం ఏంటో తెలుసా.?
క్రౌడ్ స్ట్రెక్ అనేది అమెరాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ. విండోస్‌తో పాటు పలు ఐటీ సంస్థలకు ఈ సంస్థ సెక్యూరిటీని అందిస్తుంది. అయితే చైనాలో మాత్రం చాలా తక్కువ కంపెనీలు మాత్రమే ఈ సేవలను అందిస్తున్నారు. చైనాలో పనిచేస్తున్న కొన్ని అమెరికా సంస్థలు మాత్రమే క్రౌడ్ స్ట్రైక్ సేవలను ఉపయోగించుకుంటున్నాయి. దీంతో చైనాపై పెద్దగా ప్రభావం చూపలేదు. అలాగే చైనాలోని మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసులను స్థానిక భాగస్వామి అయిన 21 వయానెట్ నిర్వహిస్తోంది. చైనాలో గ్లోబల్ క్లౌడ్ సర్వీసులను ఆ దేశంలోని సంస్థలే నిర్వహించాలనే నిబంధన ఉంది.
ఈ కారణంగానే చైనాలో ఈ సేవలను 21 వయానెట్ ఈ బాధ్యతలను చూస్తోంది. అందుకే మైక్రోసాఫ్ట్‌లో నెలకొన్న సమస్య ప్రభావం చైనాపై పెద్దగా పడకపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ప్రపంచ దేశాలతో పోల్చితే చైనాలో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు భిన్నంగా ఉంటాయి. అందుకే మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన టెక్నికల్ సమస్యలు ఆ దేశంలో విండోస్ ఉపయోగిస్తున్న వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
పర్సనల్ కంప్యూటర్లపై ఎందుకు ప్రభావం పడలేదు..
ఇదిలా ఉంటే వ్యక్తిగత కంప్యూటర్లు ఉపయోగిస్తున్న వారిలో ఈ సమస్య ఎందుకు రాలేదనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. ఇంట్లో, ఆఫీసుల్లో ఉపయోగించే కంప్యూటర్స్ యథావిధిగా పనిచేశాయి. దీనికి కారణం క్రౌడ్ స్ట్రైక్ సెక్యూరిటీని ఎక్కువగా సైబర్ దాడుల నుంచి సంరక్షించుకునేందుకు గాను కొన్ని ఐటీ, ఎయిర్ లైన్స్, బ్యాంకింగ్ వంటి సంస్థలు మాత్రమే ఉపయోగిస్తున్నాయి. దీంతో ఈ సేవలను ఉపయోగించుకుంటున్న కంపెనీలపై మాత్రమే ఈ ప్రభావం పడింది.