ఎడమవైపు తిరిగి పడుకుంటే హార్ట్ ఎటాక్ వస్తుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

కొంతమంది కుడివైపుకి తిరిగి పడుకుంటే, కొంతమంది ఎడమవైపుకి తిరిగి పడుకుంటారు. మరి గుండె ఎడమవైపు ఉంటుంది కాబట్టి.. గుండెపై ఒత్తిడి పడి.. హార్ట్ ఎటాక్ వస్తుందా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.


కుడివైపు కంటే ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిదని చాలా మంది చెబుతుంటారు. అలా పడుకుంటే, పొట్టలో గ్యాస్ ఏర్పడదు అంటుంటారు. ఐతే.. మన గుండె ఎడమవైపు ఉంటుంది కాబట్టి.. ఎడమవైపుకి తిరిగి పడుకుంటే.. గుండెపై ఒత్తిడి పడుతుందేమో అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. మెడ నుంచి ఎడమ భుజంవైపు నొప్పి వస్తూ ఉంటే.. అది హార్ట్ ఎటాక్ రాబోతోంది అని చెప్పే సంకేతాలలో ఒకటి. ఐతే.. కొంతమంది ఎడమవైపుకి తిరిగి పడుకున్నవారు ఉదయం నిద్రలేచాక.. భుజానికి తిమ్మిరి (Numbness) పట్టడాన్ని గమనిస్తారు. అది హార్ట్ ఎటాక్ సంకేతంగా భావించే ప్రమాదం ఉంది. కానీ అది ఆ సంకేతం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు.. కొన్ని సందర్భాల్లో.. ఎడమ భుజానికి రక్త ప్రసరణ సరిగా అవ్వదు. అప్పుడు ఆ భాగానికి తిమ్మిరి పడుతుంది. తెల్లారి నిద్ర లేచాక.. వెంటనే ఆ భాగానికి రక్త సరఫరా మొదలవుతుంది. రక్తం వేగంగా ప్రవహిస్తుంది. దాంతో.. తిమ్మిరిగా అనిపిస్తుంది. ఈ తిమ్మిరి 5 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపే ముగుస్తుంది. అలా అవ్వకుండా.. మరింత ఎక్కువ సేపు తిమ్మిరిగా లేదా నొప్పిగా ఉంటే.. అప్పుడు అలర్ట్ అవ్వాలి. నొప్పి వస్తుంటే.. అది హార్ట్ ఎటాక్ సంకేతంగా భావించవచ్చు. నొప్పి లేకపోతే, అది జస్ట్ తిమ్మిరి మాత్రమే అని గ్రహించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) 2025 జనవరి 24న ఒక రిపోర్టును ప్రచురించింది. దాని ప్రకారం ఎడమవైపుకి తిరిగి పడుకుంటే, సాధారణంగా గుండె ఆరోగ్యానికి హా జరగదు. కానీ గుండె ఫెయిల్యూర్ ఉన్నవారిలో శ్వాస ఆడకపోవడం (షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్) పెరగవచ్చు. అంటే.. వారికి ఊపిరి సరిగా అందదు. అందువల్ల రాత్రి పడుకునే సమయంలో.. ఆల్రెడీ ఆయాసం ఉన్నా లేక.. ఊపిరి సరిగా అందని పరిస్థితి ఉంటే.. అలాంటి వారు.. ఎడమవైపుకి తిరిగి పడుకోకూడదు. బదులుగా.. తల, పొట్టను ఆకాశంవైపు చూపేలా పడుకోవాలి. అప్పుడు శ్వాస బాగా అందగలదు. “గుండె ఫెయిల్యూర్ ఉన్నవారు ఎడమవైపుకి పడుకుంటే శ్వాస సమస్యలు తీవ్రమవుతాయి, కానీ ఇది హార్ట్ ఎటాక్‌కు కారణం అవ్వదు” అని జాన్స్ హాప్కిన్స్ స్లీప్ సెంటర్‌లో డాక్టర్ రాచెల్ సాలాస్ తెలిపారు.

మన బాడీలో నిరంతరం పనిచేసే అవయవాల్లో గుండె ఒకటి. అందువల్ల ప్రకృతి సహజంగానే గుండెకు చాలా రక్షణ కల్పించింది. మన బాడీలో ఎముకల గూడు ఉంటుంది. అందులో.. గుండె ప్రాంతంలో పక్కటెముకలు (Ribs) ఉంటాయి. ఇవి గుండె చుట్టూ రక్షణ కవచంలా ఉంటాయి. అందువల్ల ఎడమవైపుకి తిరిగి పడుకున్నా.. గుండెపై ఒత్తిడి ఉండదు. ఐతే.. 2018లో వచ్చిన వెక్టర్‌కార్డియోగ్రఫీ అధ్యయనం ప్రకారం.. ఎడమవైపుకి తిరిగి పడుకుంటే గుండె స్థానం కొద్దిగా మారవచ్చు. ECG (ఎలక్ట్రోకార్డియోగ్రామ్)లో ఈ మార్పులు కనిపిస్తాయి. కానీ అవి గుండె పనితీరుకి హాని చెయ్యవు.

నిజానికి కుడివైపుకి తిరిగి పడుకుంటే.. యాసిడ్ రిఫ్లక్స్ (GERD) సమస్య వస్తుంది. అంటే.. ఆహారనాళంలో గ్యా్స్ ఉత్పత్తి అవుతుంది. అది.. ఛాతీ దగ్గర నొప్పిని తెప్పించగలదు. దాంతో.. గుండె నొప్పిలా అనిపించగలదు. బదులుగా.. ఎడమవైపుకి తిరిగి పడుకుంటే.. యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉండదు. అందువల్ల ఛాతీ నొప్పి వచ్చే అవకాశాలు 30 శాతం తక్కువ. అది గుండెకు మంచిదే. ఈ రెండూ కాకుండా.. తలను ఆకాశంవైపు పెట్టుకొని పడుకుంటే ఇంకా మంచిది. దీని వల్ల ముఖంపై ముండతలు రావు. త్వరగా ముసలితనపు లక్షణాలు కనిపించవు.

ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు ఎడమవైపుకి తిరిగి పడుకోవచ్చా అనే సందేహా చాలా మందిలో ఉంటుంది. సహజంగా అలాంటి పేషెంట్లు ఎడమవైపుకి తిరిగి పడుకోవడాన్ని తగ్గిస్తారు. ఎందుకంటే.. గుండెకు సమస్య వస్తుందేమో అనే ఆలోచన వారికి ఉంటుంది. దీనిపై 2003లో ల్యూంగ్ ఎట్ అల్ అధ్యయనం జరిగింది. గుండె సమస్యలు ఉన్నవారు కూడా.. ఎడమవైపుకి తిరిగి పడుకున్నా సమస్యేమీ ఉండదని తేల్చింది. ఇదే అంశంపై 2018లో బయ్రాక్తార్ అండ్ ఓజెక్ అధ్యయనం జరిగింది. దాని ప్రకారం.. ఎడమవైపుకి తిరిగి పడుకుంటే గుండె సైజ్, పనితీరులో మార్పులు వస్తాయి. కానీ అవి ప్రమాదకరమైనవి కావు.

అన్నింటికంటే ముఖ్యంగా.. నిద్ర బాగా నిద్రపోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు మనం 2025 మార్చి 1న రిలీజైన AHA అధ్యయనం ఏం చెప్పిందో చూస్తే.. సరిగా నిద్రపోనివారికి గుండె వ్యాధులు వచ్చే అవకాశం 16 నుంచి 22 శాతం ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఇక్కడ పొజిషన్‌తో సంబంధం లేదు. ఎలా పడుకున్నా.. బాగా నిద్రపోవాలన్నదే కీలకం. కొంతమందికి నిద్ర సరిగా పట్టదు. దాన్నే స్లీప్ అప్నియా అంటారు. అది ఉన్నవారు సైడ్ స్లీపింగ్ చెయ్యాలి. బ్యాక్ స్లీపింగ్ (ముఖం, పొట్ట భూమివైపు ఉండటం) చేస్తే.. గుండెకు ప్రమాదం పెరుగుతుంది అని బ్రిగ్హామ్ అండ్ విమెన్స్ హాస్పిటల్‌లో డాక్టర్ సుసాన్ రెడ్‌లైన్ చెప్పారు.

గర్భిణీలైతే.. ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిది. తద్వారా వారి గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. కానీ గుండె సమస్యలు ఉన్నవారు.. రైట్ సైడ్ లేదా బ్యాక్ పొజిషన్ ఎంచుకోవాలి, అంటే తల ఆకాశంవైపు చూస్తున్నట్లు పడుకోవాలి. వెన్నుపూస.. నేలవైపు ఉండాలి. మొత్తంగా మీరు ఎడమవైపుకి తిరిగి పడుకున్నప్పుడు మీకు తిమ్మిరి వస్తే, 10 నిమిషాలు వెయిట్ చెయ్యండి. తిమ్మిరి తగ్గిపోతే, ఆందోళన అక్కర్లేదు. తిమ్మిరి బదులు నొప్పి మొదలైతే, అప్రమత్తం అవ్వాలి. ఫైనల్‌గా ఎటు తిరిగి పడుకున్నా.. మంచి నిద్ర నిద్రపోవడం అవసరం అని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ కనీసం 7 గంటలు పడుకోవాలని సూచిస్తున్నాయి.

(Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత ఆరోగ్య నిపుణుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి.)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.