రీల్ చేయండి.. రూ.15వేలు గెలుచుకోండి.. కేంద్రం బంపర్ ఆఫర్..

రీల్స్ అంటే యువతకు పిచ్చి. ప్రతి ఒక్కరు రీల్ చేయడం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కామన్‌గా మారింది. అయితే రీల్స్ తో మనీ సంపాదించేవాళ్లు ఉన్నారు. రీల్స్ చేసేవారికి కేంద్రం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కేంద్రం చెప్పినట్లుగా రీల్ చేసి రూ.15 వేలు గెలుచుకోవచ్చు.

డిజిటల్ ఇండియా.. 2015లో ప్రారంభమైన ఈ కార్యక్రమం గ్రామాల నుండి నగరాల దాకా ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తెచ్చింది. టెక్నాలజీతో ప్రజలను అనుసంధానించింది. ఆన్‌లైన్ ప్రభుత్వ సేవలు, డిజిటలైజేషన్ కారణంగా పారదర్శకత పెరిగింది. డిజిటల్ హెల్త్ రికార్డులు, ఆధార్ లింక్ సర్వీస్, యూపీఐ లావాదేవీలు వంటి విషయాలు డిజిటల్ ఇండియా గెలుపుకు నిదర్శనం. ఈ విజయాన్ని ప్రజలు తమ కథల ద్వారా జరుపుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని కోసం సొంత కథలతో రీల్స్‌ను ఆహ్వానిస్తోంది. డిజిటల్ ఇండియా చేపట్టి 10ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్రభుత్వం డిజిటల్ ఇండియా దశాబ్దం-రీల్ పోటీ అనే ప్రత్యేకమైన పోటీని ప్రారంభించింది. ఈ పోటీ జూలై 1న ప్రారంభమవ్వగా.. ఆగస్టు 1 వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా డిజిటల్ ఇండియా కారణంగా ప్రజల జీవితాల్లో వచ్చిన పెద్ద మార్పుల గురించి తెలుసుకోవడం దీని ఉద్దేశ్యం. ఆన్‌లైన్ సేవలు, డిజిటల్ విద్య, ఆరోగ్య సేవలు లేదా డిజిటల్ మనీతో మీ లైఫ్ బాగుంటే దానిని ఒక క్రియేటవ్ రీల్‌గా మార్చుకునే అవకాశం కేంద్రం ఇస్తోంది. ఈ రీల్ ద్వారా మీరు డబ్బు కూడా గెలుచుకోవచ్చు. ఈ రీల్ ఎలా చేయాలి..? మనీ ఎలా వస్తాయి..? ఎక్కడ అప్‌లోడ్ చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


రీల్ ఎలా ఉండాలి..?

రీల్ చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. రీల్ కనీసం 1 నిమిషం నిడివి ఉండాలి. వీడియో ఒరిజినల్‌గా ఉండాలి. ఇంతకు ముందు ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో పోస్ట్ చేయనిదై ఉండాలి. మీరు దీన్ని ఏ భాషలోనైనా చేయవచ్చు. రీల్ పోర్ట్రెయిట్ మోడ్‌లో, MP4 ఫార్మాట్‌లో ఉండాలి. ఈ వీడియో డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది అనే పాయింట్ ఆధారంగా ఉండాలి.

రీల్‌ను ఎలా పంపాలి?

ఈ పోటీకి సంబంధించిన సమాచారం, రీల్‌ను అప్‌లోడ్ చేయడానికి ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://www.mygov.in/task/decade-digital-india-reel-contestలో మీరు తెలుసుకోవచ్చు.

నగదు బహుమతి

ఈ పోటీలో పాల్గొనేవారికి ప్రభుత్వం నగదు బహుమతులు అందిస్తోంది. టాప్10 విజేతలకు రూ. 15,000, ఆ తర్వాత 25 మందికి రూ. 10,000, వారి తర్వాత ఎంపిక చేసిన 50 మందికి రూ. 5,000 బహుమతి లభిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.