మంచి సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం వెతుకుతున్నారా? లేదా జాబ్ ఛేంజ్ అయ్యే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. పాపులర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ విప్రో, మంచి ఎంట్రీ-లెవల్ కెరీర్ ఆపర్చునిటీస్ అందిస్తోంది.
మీరు ఫ్రెషర్ అయినా లేదా నాలుగు సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నాసరే అప్లై చేయవచ్చు. కెరీర్ అద్భుతంగా బిల్డ్ చేసుకోవడానికి విప్రో చక్కటి వేదిక. కంపెనీ ప్రస్తుతం ఆఫర్ చేస్తున్న ఉద్యోగాల్లో చాలా వరకు వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీస్ (WFH) కావడం విశేషం.
* జాబ్ డీటైల్స్
అభ్యర్థులు ఫుల్‌టైమ్ లేదా పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. ఫ్రెషర్స్ లేదా నాలుగేళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్స్ అర్హులు. అభ్యర్థులు తప్పకుండా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. మల్టిపుల్ లొకేషన్ల కోసం ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. కొన్ని పోస్టులకు వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్‌లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఉద్యోగంలో చేరాక శాలరీ, అలవెన్సులు ఎలా ఉంటాయనేది కంపెనీ పేర్కొనలేదు.
* విప్రో హైరింగ్ ప్రాసెస్
టెక్నికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్‌ని ప్రధానంగా విప్రో కంపెనీ పరీక్షిస్తుంది. హైరింగ్ ప్రాసెస్‌లో వివిధ దశలు ఉంటాయి.
ఆన్‌లైన్ అప్లికేషన్: మీ రెజ్యూమ్, అవసరమైన డీటైల్స్‌ని ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి.
ఆప్టిట్యూడ్ టెస్ట్: తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ స్కిల్స్‌ని అంచనా వేస్తారు.
టెక్నికల్ టెస్ట్‌లు: మూడో రౌండ్‌లో ప్రోగ్రామింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ మొదలైన వాటికి సంబంధించిన అసెస్‌మెంట్స్ ఉంటాయి.
ఇంటర్వ్యూ రౌండ్: చివరిగా టెక్నికల్, హెచ్ ఆర్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ఫైనల్ సెలక్షన్ టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, విప్రో కోర్ వ్యాల్యూస్‌తో అభ్యర్థి ఎంత వరకు సరిపోతాడనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.
* హైరింగ్ డివిజన్లు విభాగాలు
విప్రో వివిధ విభాగాలలో ఉద్యోగులను రిక్రూట్ చేస్తుంది, వీటిలో:
– టెక్నాలజీ & ఇంజనీరింగ్
మీకు టెక్నాలజీపై ఆసక్తి ఉంటే, మీరు ఇందులో జాబ్‌లకి అప్లై చేసుకోవచ్చు. ఇందులో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ రోల్స్ ఉంటాయి.
– కన్సల్టింగ్ & డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్
అలానే విప్రో బిజినెస్ ఇన్నోవేషన్, స్ట్రాటెజిక్ సొల్యూషన్స్ అందించగల ప్రొఫెషనల్స్‌ని నియమించుకుంటోంది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై మీకు ఆసక్తి ఉంటే ఇది సరైన అవకాశం.
– ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & సెక్యూరిటీ సర్వీసెస్
ఐటీ సపోర్ట్ అండ్ సెక్యూరిటీ మీకు ఎక్సైటింగ్‌గా ఉంటే, విప్రో ఉద్యోగ అవకాశాలు అందిస్తోంది. నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్, ఐటీ సపోర్ట్, సైబర్ సెక్యూరిటీ రోల్స్ అందిస్తోంది.
* అప్లికేషన్ ప్రాసెస్
అర్హత ఉన్న అభ్యర్థులు విప్రో లింక్డ్ఇన్ పేజీ లేదా వారి అధికారిక కెరీర్ వెబ్‌సైట్‌ను విజిట్ చేసి, అప్లై చేయవచ్చు.
* విప్రోలో ఎందుకు చేరాలి?
విప్రో అద్భుతమైన కెరీర్ గ్రోత్, కొలాబరేటివ్ వర్క్ ఎన్విరాన్‌మెంట్ అందిస్తుంది. అత్యాధునిక టెక్నాలజీతో పని చేసే అవకాశాలు లభిస్తాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీతో, ఉద్యోగులు తమ ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు.