కొత్త జీవితం కోసం కోటి ఆశలతో

ఏ వ్యక్తి జీవితంలోనైనా విడాకులు బాధాకరం. ఆ దశను దాటుకొని మరో వివాహం చేసుకోవడం చాలా కష్టం. అయితే అన్ని విడాకులు, రెండో పెళ్లికి దారితీయవు. ఏకంగా వైవాహిక బంధం మీద విరక్తి పెంచుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు.


ఉదాహరణకు కరిష్మా కపూర్ నే తీసుకుంటే, సంజయ్ కపూర్ నుంచి విడిపోయిన తర్వాత ఆమె మళ్లీ పెళ్లి ఆలోచన చేయలేదు. పూర్తిగా తన దృష్టి మొత్తం పిల్లలు, కెరీర్ పై మాత్రమే పెట్టింది.

ఇదే విధంగా చిత్రాంగద సింగ్, మనీషా కొయిరాలా, పూజాబాత్రా లాంటి చాలామంది తారలు వైవాహిక బంధం నుంచి పూర్తిగా తప్పుకున్నారు. అయితే అదే టైమ్ లో విడాకుల తర్వాత కొత్త జీవితం కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న భామలు కూడా ఉన్నారు.

సమంత.. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత చాలా ట్రోలింగ్ ఎదుర్కొంది. అదే టైమ్ లో ఎంతో సపోర్ట్ కూడా అందుకుంది. ఆమెను మరో వివాహం చేసుకోమని చాలామంది సూచించారు. అంత వరకు వెళ్తుందో లేదో చెప్పలేం కానీ, ఓ కొత్త రిలేషన్ షిప్ అయితే సమంత మొదలుపెట్టింది.

రాజ్ నిడిమోరుతో ఆమె క్లోజ్ గా ఉంటోంది. తన భవిష్యత్ భాగస్వామిని రాజ్ లో ఆమె చూసుకుంటోందంటున్నారు సన్నిహితులు. ఇప్పటికే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకొని సెటిలయ్యాడు కాబట్టి, ఇక సమంత కూడా ఎక్కువ టైమ్ తీసుకోదని చెబుతున్నారు.

నిహారిక కొణెదల కూడా తన రెండో వివాహంపై ఇదివరకే ప్రకటన చేసింది. జొన్నలగడ్డ చైతన్య నుంచి విడిపోయిన తర్వాత సింగిల్ గా ఉంటున్న ఆమె, ఎప్పుడైనా ప్రేమలో పడొచ్చని తెలిపింది. రీసెంట్ గా నాగబాబు కూడా ఈ అంశంపై ప్రకటన చేశారు. ప్రస్తుతం నిహారిక హ్యాపీగా ఉంటుందని, కొన్నేళ్లకు ఇంకో అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటుందని అన్నారు.

ఇక రీసెంట్ గా రేణు దేశాయ్ కూడా తన రెండో పెళ్లి అంశంపై ప్రకటన చేశారు. పవన్ కల్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత పూర్తిగా పిల్లల బాగోగులపై దృష్టి పెట్టిన రేణు.. ఆమధ్య రెండో పెళ్లికి సిద్ధమైనట్టు కనిపించినా కొన్ని కారణాల వల్ల ఆగిపోయారు.

అప్పట్నుంచి ఆమె మరో వివాహం అనే ఆలోచనకు దూరంగానే ఉన్నారు. అయితే ఈమధ్య పిల్లలే ఆమెను మరో పెళ్లి చేసుకోమని ప్రోత్సహిస్తున్నారట. ఎవరితో సంతోషంగా ఉంటావో అతడినే చేసుకోమని అకిరా కూడా కోరాడంట. ఇకపై తను కొత్త జీవితాన్ని ప్రారంభించగలనని ఆమె అన్నారు.

ఊర్మిళ, మలైకా అరోరా కూడా ప్రస్తుతం సింగిల్ గా ఉన్నప్పటికీ మరో పెళ్లిపై సీరియస్ గా ఆలోచిస్తున్నారు. పెళ్లిపై తమకు విముఖత లేదని, కాలం ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుందంటూ ఇద్దరూ ఒకే లాంటి స్టేట్ మెంట్స్ ఇవ్వడం విశేషం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.