రిలయన్స్ జియో శుక్రవారం 21 దేశాలకు కొత్త అంతర్జాతీయ సబ్‌స్క్రైబర్ డయలింగ్ (ISD) రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించింది. Jio మొత్తం ఏడు ప్లాన్‌లను ప్రారంభించింది.
ప్రతి రీఛార్జ్ వినియోగదారులకు సరైన ఆన్-కాల్ నిమిషాలను అందిస్తుంది. ఈ ప్లాన్‌ల ధర రూ. 39 నుండి మొదలై రూ. 99 వరకు ఉంటుంది. ఈ ప్లాన్‌లు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్‌లు ముఖ్యంగా అంతర్జాతీయంగా షార్ట్ కాల్స్ మాత్రమే చేసే కస్టమర్‌ల కోసం. కాలింగ్ నిమిషాలతో పాటు, ఈ ప్లాన్‌లలో కస్టమర్‌లు ఇతర ప్రయోజనాలను పొందలేరు.
Reliance Jio కొత్త మినిట్ ప్యాక్ ధర రూ. 39 నుండి ప్రారంభమవుతుంది. ఈ ప్లాన్‌లు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లకు అందుబాటులో ఉంటాయి. వివిధ ప్లాన్‌ల ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
– రూ. 39 ప్లాన్ యూఎస్, కెనడాకు అంతర్జాతీయ కాల్‌లకు అందుబాటులో ఉంటుంది. 30 నిమిషాల కాలింగ్ సమయాన్ని అందిస్తుంది.
– రూ. 49 ప్లాన్ బంగ్లాదేశ్‌కు కాల్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే 20 నిమిషాల కాలింగ్ సమయాన్ని అందిస్తుంది.
– రూ. 59 ప్లాన్ సింగపూర్, థాయ్‌లాండ్, హాంకాంగ్, మలేషియాకు కాల్ చేసే వినియోగదారుల కోసం 15 నిమిషాల కాలింగ్ సమయాన్ని అందిస్తుంది.
– రూ.69 ప్లాన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు కాల్ చేసే కస్టమర్‌ల కోసం, 15 నిమిషాల కాలింగ్ సమయాన్ని అందిస్తుంది.
– రూ.79 ప్లాన్ యూకే, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లకు కాల్ చేసే కస్టమర్‌ల కోసం, 10 నిమిషాల కాలింగ్ సమయాన్ని అందిస్తుంది.
– రూ. 89 ప్లాన్ చైనా, జపాన్, భూటాన్‌లకు కాల్ చేసే కస్టమర్‌ల కోసం, 15 నిమిషాల కాల్ సమయాన్ని అందిస్తుంది.
– రూ. 99 ప్లాన్ UAE, సౌదీ అరేబియా, టర్కీ, కువైట్, బహ్రెయిన్‌లకు కాల్ చేసే వినియోగదారుల కోసం, 10 నిమిషాల కాలింగ్ సమయాన్ని అందిస్తుంది.
అన్ని ప్లాన్‌లు 7 రోజుల వాలిడిటీని కలిగి ఉంటాయి
ఈ రీఛార్జ్ ప్లాన్‌లు కస్టమర్‌లు కనెక్ట్ అయి ఉండాలనుకుంటున్న ప్రాంతానికి మాత్రమే చెల్లించడంలో సహాయపడేందుకు ఈ ప్లాన్స్ ఉన్నాయి. అన్ని రీఛార్జ్ ప్లాన్‌లు 7 రోజుల చెల్లుబాటుతో వస్తాయి. ఈ హైబ్రిడ్ ప్లాన్‌లు అన్ని జియో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ కస్టమర్‌లకు అందుబాటులో ఉన్నాయి.