ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ. 10 లక్షల వరకూ లోన్.. ఎవరు అర్హులంటే?

భారత ప్రభుత్వం యువతలో పారిశ్రామిక శక్తిని ప్రోత్సహించేందుకు వివిధ పథకాల కింద భారీ మెుత్తంలో ప్రోత్సాహకాలను అందిస్తూ వస్తోంది. వ్యవసాయేతర, కార్పొరేట్, సుక్ష్మ, చిన్న తరహా సంస్థలకు సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్ర యోజన(PMMY) పథకాన్ని 2015 ఏప్రిల్ 8న ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఎలాంటి గ్యారెంటీ లేకుండా.. రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకూ లోన్లు మంజూరు చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రధాన మంత్రి ముద్ర యోజన స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం యువ పారిశ్రామికులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కమర్షియల్, RRBలు, MFI, NBFC లాంటి పలు ఆర్థిక సంస్థల ద్వారా అర్హులైన వ్యక్తులకు రూ. 10 లక్షల వరకూ లోన్లు ఇస్తున్నారు. ఈ స్కీమ్ లో భాగంగా ముద్ర 3 ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. శిశు, కిషోర్, తరుణ్ లాంటి మూడు రకాల లోన్లు ఇస్తోంది. మెుదటగా శిశు విభాగంలో రూ. 50 వేలు, కిషోర్ లోన్ కింద రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు అందిస్తారు. ఇక చివరిగా తరుణ్ లోన్ కింద రూ. 5లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్లు మంజూరు చేస్తారు.

భారత ప్రభుత్వం ముఖ్యంగా యంగ్ జనరేషన్ లో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను ప్రోత్సహించడానికి శిశు కేటగిరీ యూనిట్ లపై ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉండగా.. ఈ పథకంలో ముద్ర లోన్లు రెండు రకాల స్కీమ్స్ ద్వారా అందిస్తారు. అందులో ఒకటి మైక్రో క్రెడిట్ స్కీమ్. ఇందులో ఒక లక్ష వరకు అందిస్తారు. రెండో దాంట్లో రీ ఫైనాన్స్ ద్వారా లోన్లు మంజూరు చేస్తారు. ఇవి వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంది.

Related News

మ్యానుఫాక్చరింగ్, పౌల్ట్రీ, డైరీ, తేనేటీగల పెంపకం, వ్యాపారం, సేవలు, వ్యవసాయం లాంటి రంగాలలో టర్మ్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్స్ అవసరాల కోసం ప్రధాన మంత్రి ముద్ర యోజనలో రుణాలు అందిస్తుంది. అయితే బయటి వడ్డీ రేట్లకంటే తక్కువగానే ఇందులో వడ్డీ రేట్లు ఉంటాయని తెలుస్తోంది. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి వడ్డీ రేట్లు ఉంటాయి. అయితే ఈ రుణాల కోసం అప్లై చేసేవారు ఎలాంటి ఛార్జీలు కానీ.. గ్యారెంటీ పత్రాలు కానీ సమర్పించాల్సిన అవసరం లేదు.

అర్హతలు:
దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. బిజినెస్ ప్లాన్ సిద్ధంగా ఉన్న ఏ వ్యక్తి అయినా లోన్ పొందొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్‌, ట్రేడింగ్‌, సర్వీస్‌ సెక్టార్స్‌లో ఇన్‌కమ్‌-జనరేటింగ్‌ యాక్టివిటీలకు, త్రీ లోన్‌ ప్రొడక్టులలో వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న కార్యకలాపాలకు లోన్‌లు మంజూరు ఇస్తారు. అయితే దరఖాస్తుదారుడు గతంలో డిఫాల్ట్ హిస్టరీని కలిగి ఉండకూడదు. కనీసం 3 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ ఉండాలి. 24 నుంచి 70 ఏళ్ల వయస్సుగలవారై ఉండాలి.

దరఖాస్తు విధానం:
పైన తెలిపిన అర్హతలు ఉన్న వారు అధికారిక వెబ్ సైట్ www.udyamimitra.in ఓపెన్ చేయాలి. అందులో అప్లై నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి.. అక్కడ వచ్చిన వాటిల్లో ఒకదాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఇక కొత్తగా రిజిస్టేషన్ చేస్తుంటే.. దరఖాస్తుదారుని పేరు, ఈమెయిల్ ఐడీ, మెుబైల్ నంబర్ యాడ్ చేసి.. ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న సంబంధిత బ్యాంకులను సంప్రదించవచ్చు.

Related News