ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీ పోస్ట్ ఆఫీస్ లకు వెళ్లే మహిళలకు… ఊహించని షాక్ తగిలింది. నెలకు 1500 రూపాయలు వస్తాయని ఓ వార్త ప్రచారం జరగడంతో పోస్ట్ ఆఫీస్ లకు మహిళలు క్యూ కట్టారు.
అయితే ఇందులో వాస్తవం లేదని తెలుస్తోంది. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు అందాలంటే కచ్చితంగా పోస్ట్ ఆఫీస్ లో ఖాతాలు తెరవాలని… నిన్నటి నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
1,500 per month advertisement Women queue at post offices
అదే సమయంలో ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు ఆధార్ కార్డు అలాగే ఎన్పీసీఐ తో లింకు చేసుకోవాలని కొంతమంది ప్రచారం చేశారు. అయితే ఈ వార్త బాగా వైరల్ గా మారింది. ఇంకేముంది నెలకు 1500 రూపాయలు రావాలంటే ఖచ్చితంగా.. అప్లై చేసుకోవాలని పోస్ట్ ఆఫీస్ లకు ఏపీ మహిళలు క్యూ కట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే దీనిపై కొంతమంది అధికారులు కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకం పైన అధికారిక ప్రకటన చేయలేదని… పుకార్లు నమ్మకూడదని అధికారులు వెల్లడించారు. దీంతో ఏపీ మహిళలు కాస్త శాంతించి ఇంటికి వెళ్తున్నారు.