Wonder: అనంతపురంలో అద్భుతం.. ఇలాంటి చెట్టు ప్రపంచంలోనే మరెక్కడా లేదు!

ప్రపంచములోనే అతి పెద్దదైన మర్రి చెట్టు ఈ మహా వృక్షము. ఇది శ్రీ సత్యసాయి జిల్లా, నంబుల పులకుంట మండలములో గూటిబైలు గ్రామములో ఉంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో 1989 వ సంవత్సరంలో స్థానం సంపాదించిన ఈ చెట్టు 10 ఎకరాలలో విస్తరించింది.
ఈ మర్రి చెట్టుపై లోకల్ 18 ప్రత్యేక కథనం. తిమ్మమ్మ అను పతివ్రతా శిరోమణి భర్త మరణించినపుడు తను కూడా భర్త శవముతో పాటు అగ్నిగుండం ద్వారా సతీ సహగమనం కావాలి అని విజయనగర రాజుల కాలంలో సదరు గ్రామ కొక్కొంటి గ్రామ పాలేరు గారు కోరినట్లు, ఆయన ఇంటి ఆవరణలో ఎండిపోయిన కాకర చెట్టును బ్రతికించమని ఆయన తిమ్మమ్మ పతివ్రత్యానికి పరీక్ష పెడతారు.


ఒక బోయవాని చేతిలోని చనిపోయిన పావురముకు ప్రాణం పోసి, అవి ఆకాశములోకి ఎగిరిపోయేల చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుని, సతీసహగమనం అనుమతి పొంది జరుగుతుంది. సతీసహగమనం అగ్నిగుండం నలువైపులా నాలుగు ఎండిన మర్రికొమ్మలను నాటించి, అందులో ఈశాన్యపు మర్రికొమ్మ వృద్ధి చెంది, ప్రపంచ ప్రసిద్ధి కాంచి, మహా వృక్షం మర్రిచెట్టు ఉన్నంత వరకు నా ప్రాణములు అందులో ఉంటాయి. నన్ను పూజించిన వారి కోర్కెలను తీరుస్తాను అని ఆకాశవాణి ధ్వని ద్వారా ప్రజలు అందరికి వినపడింది.

అప్పటినుండి మర్రిమాను దినదినాభివృద్ధి చెందుతూ వస్తోంది. భక్తులందరూ కోర్కెలను తీరుస్తూ తిమ్మమ్మగా మర్రిమాను మధ్యలో దేవాలయములో పూజలందుకుంటూ ఉంది. పెళ్లికాని వారికి పెళ్లై, పిల్లలు పుట్టనివారికి ఇక్కడికి వచ్చి చెట్టుకు తాయిత్తు కడితే అనుకున్నవి జరుగుతాయి అని భక్తుల నమ్మకం. అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి దర్శించడానికి వస్తుంటారు.

ఇక్కడ ఉన్న చెట్టుపై ఏ పక్షి గుడ్డు పెట్టదు, ఎలాంటి పక్షి రాత్రిపూట నిద్రపోదు అని ఇక్కడి భక్తులు చెబుతున్నారు. అలాగే ఇక్కడి నుండి చెట్టు ఆకు కానీ, వేరు కానీ తీసుకు వెళ్లకూడదు అని అంటుంటారు ఈ ప్రాంతం వాసులు. ఈ తిమ్మమ్మ మర్రిమాను అనంతపురానికి 115 కిలోమీటర్ల దూరములో, మదనపల్లి కి 70 కిలోమీటర్ల దూరములో ఉన్నది. ప్రతి రోజూ మదనపల్లి, కదిరి నుండి APSRTC బస్సులు అందుబాటులో కలవు.