ప్రతీ ఏటా నవంబర్ 13న ప్రపంచ దయా దినోత్సవం జరుపుకుంటారు. మనలో దయను ప్రోత్సహించే ఈ రోజు, మన జీవితంలో దయ ప్రాధాన్యత కలిగిస్తుంది. ఒక చిరునవ్వు, మమకారంతో సహాయం చేయడం ద్వారా మనం ఇతరులకు మనస్పూర్తిగా సాయం చేయగల సమర్ధతను గుర్తుచేసే రోజు ఇది.
మనిషిలోని దయ ఈ ప్రపంచాన్ని అందరికీ సుఖ సంతోషాలిన్చే స్థలంగా మార్చగలదు. అలాంటి దయ దినోత్సవం ఎప్పుడు మొదలైంది. దాని ప్రత్యేకత ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
దయా దినోత్సవం ఆరంభం..
ప్రపంచ దయా దినోత్సవం మొదట 1997లో జపాన్‌లోని టోక్యోలో జరిగిన ప్రపంచ దయా ఉద్యమం ద్వారా ప్రారంభమైంది. తర్వాత, ఆస్ట్రేలియా, కెనడా, నైజీరియా వంటి దేశాల్లో జరుపుకునే వారు. 2005లో ఇంగ్లాండ్, 2009లో సింగపూర్‌లో దయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆయా దేశాలు ప్రారంభించాయి. 2019 నాటికి, ఇది ఫ్రాన్స్, యుఎస్ఎ వంటి 27 దేశాలకు విస్తరించింది.
మానవులు సహజంగానే దయకు ఆకర్షితులవుతారు, ఎందుకంటే మన మనుగడకి, మన శ్రేయస్సు కోసం మనం ఒకరితో ఒకరు సంభందాలను ఏర్పరచుకోవాలి. మమకారాలు కూడా మన మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి సహకరిస్తాయి. స్నేహపూర్వక స్పర్శ మన మనసుకు శాంతి కలిగిస్తుంది. ఇది మానసికంగా శ్రేయస్సును పెంపొందిస్తుంది.
ప్రేమ ఒక శక్తివంతమైన భావన. దయతో ప్రేమ పంచడం ద్వారా బయటపడుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న కష్టాల మధ్య, దయ మనకు ఉత్తేజాన్ని ఇస్తుంది. దయ మనకు ఇతరులపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఇస్తుంది.
* సులభమైన దయాగుణాలు ప్రదర్శించే మార్గాలు
– స్నేహితులకు ధన్యవాదాలు తెలపడం
– ఇతరులను పొగడటం
– కుటుంబంతో మళ్ళీ కలవడం
– పేదలకు లేదా వృద్ధులకు సహాయం చేయడం
– రక్తం, ఆహారం లేదా దుస్తులు దానం చేయడం
– పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం, వాలంటీర్ గా పాల్గొనడం
ఇలాంటి దయ వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. – ఆనందాన్ని తెస్తుంది. గుండెను ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. సంబంధాలను బలోపేతం చేస్తుంది. సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది.