న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (వైసీపీ) సుప్రీంలో చుక్కెదురైంది. పోస్టల్ బ్యాలెట్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్ధించింది. పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలని, సీలు, హోదా అవసరం లేదని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది.
న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YCP) సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. పోస్టల్ బ్యాలెట్లపై (Postal Ballot) హైకోర్టు (High Court) ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్ధించింది. పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలని, సీలు, హోదా అవసరం లేదని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది. పోస్టల్ బ్యాలెట్లపై జూన్ 1న (శనివారం) హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వైసీపీ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఈ పిటీషన్‌పై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ అరవింద్ కుమార్ (Justice Arvind Kumar), జస్టిస్ సందీప్ మెహతా (Justice Sandeep Mehta) ధర్మాసనం వైసీపీ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పోస్టల్ బ్యాలెట్‌పై సోమవారం సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. జస్టిస్ అరవింద్ కుమార్ , జస్టిస్ సందీప్ మెహతానేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పోస్టల్ బ్యాలెట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కాగా ఇప్పటికే టీడీపీ ఏమ్మెల్యే వెలగపూడి (TDP MLA Velagapuei) సుప్రీం కోర్టులో కేవియట్ (Caveat) దాఖలు చేశారు. వెలగపూడి తరపున సీనియర్ న్యాయవాది గుంటూరు ప్రభాకర్ కేవియట్ దాఖలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కేసులో వైసీపీకి ఏపీ హైకోర్టు (High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసింది.
అయితే తమ వాదన కూడా విన్న తరువాతే నిర్ణయం తీసుకోవాలని వెలగపూడి కేవియట్‌లో పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్‌ల విషయంలో వైసీపీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో మేం జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తేల్చి చెప్పింది. అవసరమైతే ఎన్నికల కౌంటింగ్ తరువాత ఎలక్షన్ పిటిషన్ వేసుకోమని సూచించింది. కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేది లేదని డివిజనల్ బెంచ్ స్పష్టం చేసింది.
కాగా.. పోస్టల్ బ్యాలెట్‌ల విషయంలో వైసీపీకి (YSR Congress) హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్(Postal Ballots) డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్-13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో వైసీపీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది