Tuna fish: పసుపు రెక్కల టూనా.. ధరకు ఆన

సముద్రంలో వేటకు వెళ్లిన తమిళనాడులోని రామనాథపురం జిల్లా పాంబన్‌కు చెందిన మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. జాలర్లు మన్నార్‌ గల్ఫ్‌ వద్ద వేట సాగిస్తుండగా.. వలలో పసుపు రెక్కల సూరా చేప (టూనా) చిక్కింది. ఇది సుమారు 112 కిలోల బరువు, 3 మీటర్ల పొడవు ఉంది. మత్స్సకారులు ఆదివారం ఒడ్డుకు చేరుకోగా, చేపను నలుగురు జాలర్లు తీరానికి మోసుకొచ్చారు. దీన్ని కేరళకు చెందిన ఓ వ్యాపారి రూ.17 వేలకు కొనుగోలు చేశారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.