ఏపీలో 1.30లక్షల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు: సీఎం చంద్రబాబు

యోగా మన జీవితంలో భాగం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. యోగాంధ్రపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. రాష్ట్రమంతా ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.


9వ తరగతి నుంచి విద్యార్థులు యోగా చేయాలన్నారు. భవిష్యత్తులో ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ శిక్షణ, కోర్సులు నిర్వహించనున్నట్టు చెప్పారు.

”గత నెల 21 నుంచి ఈనెల 21 వరకు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. యోగాంధ్ర కోసం 2 కోట్ల మందిని టార్గెట్‌ పెట్టుకుంటే లక్ష్యానికి మించి 2.39 కోట్లమంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. 2,600 మంది మాస్టర్‌ ట్రైనర్లను నియమించాలనుకుంటే 5,451 మంది వచ్చారు. యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవాలి. ఎల్లుండి రాష్ట్రంలో 1.30లక్షల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రపంచమంతా 8లక్షల ప్రాంతాల్లో యోగాడేలో పాల్గొంటారు.”అని సీఎం చంద్రబాబు తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.