ఈ యాప్స్‌తో ఓయోలో సీక్రెట్ కెమెరాలను ఇట్టే పట్టేయొచ్చు.. ట్రై చేయండి.

ఓయో హోటల్స్‌లో రహస్య కెమెరాలు పెట్టి, దంపతుల సన్నిహిత దృశ్యాలను చిత్రీకరిస్తూ.. భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రస్తుతం అనేక నగరాల్లో చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఓయో రూమ్‌లో బుక్స్‌ చేసుకునే వారు అలర్ట్‌గా ఉండాలి. ఇకపై హోటల్‌లో మీరు బుక్‌ చేసుకున్న రూమ్‌లోకి వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు గదిని జాగ్రత్తగా చెక్‌ చేసుకోండి. ఓయోనే కాదు. ఏదైనా హోటల్‌కు వెళ్లినప్పుడు ఆ రూమ్‌లో ఉన్న వస్తువులను జాగ్రత్తగా గమనించాలి. స్మోక్‌ డిటెక్టర్లు, గోడ గడియారాలు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లు, లైట్ బల్బులు, పుస్తకాలు, గది తలుపులు, లావా ల్యాంప్స్‌, పెన్నుల్లో ఈ సీక్రెట్‌ కెమెరాలు అమర్చే అవకాశం ఉంటుంది. గదిలోకి వెళ్లగానే.. కర్టేన్లు వేసి.. గదిలో లైట్లన్నీ ఆర్పేయాలి. చీకటి అయ్యాక ఫ్లాష్‌లైట్‌ ఆన్ చేయాలి. అప్పుడు ఆ గదిలో రహస్య కెమెరాలు ఉంటే అవి ఎరుపు లేదా ఆకుపచ్చ ఎల్‌ఈడీ రంగులో మెరుస్తాయి.


అంతే కాదు.. ఈ సీక్రెట్ కెమెరాలను గుర్తించడానికి ప్రస్తుతం కొన్ని యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో హిడెన్ కెమెరా డిటెక్టర్ ప్రో (Hidden camera detector pro) యాప్ ఒకటి. ఈ యాప్ సీక్రెట్ లేదా దాచిన స్పై కెమెరాలను గుర్తించడానికి రూపొందించారు. ఈ యాప్ దాచిన మైక్రోఫోన్‌ను కూడా కనుగొనగలదు. ఇది ఇన్‌ఫ్రారెడ్ కెమెరాను గుర్తించగలదు. వినియోగదారుల రక్షణ నిమిత్తం పలు చిట్కాలు కూడా ఇస్తుందట. అదే స్థాయిలో పని చేసే మరో యాప్ Hidden Camera & Device Finder (Apple iOS). iOSలో అందుబాటులో ఉన్న ఈ యాప్ ప్రస్తుత నెట్‌వర్క్‌లో అనుమానాస్పద పరికరాలను గుర్తించగలదని హామీ ఇస్తుంది. అన్ని దాచిన కెమెరాలను సులభంగా, త్వరగా కనుగొనగలదని యాప్ పేర్కొంది. ఇది వైఫై, బ్లూటూత్ స్కానర్‌ను కలిగి ఉంటుంది. ఇది ఏదైనా రహస్య కెమెరాను గుర్తించడంలో సహాయపడుతుంది. యాపిల్, ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా సీక్రెట్ కెమెరాలను కొనుగొని గోప్యతను కాపాడు కోండి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.