ఇక నో టెన్షన్.. గూగుల్ ఫోటోలని ఐక్లౌడ్‌లోకి ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు!

www.mannamweb.com


ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు, వీడియోలు అన్నీ గూగుల్ ఫోటోస్ యాప్ లో స్టోర్ అవుతాయి. ఎన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ ని మార్చినా గానీ జీమెయిల్ ఐడీతో లాగిన్ అయితే గూగుల్ ఫోటోలు, వీడియోలు చూసుకోవచ్చు. అయితే కొత్తగా యాపిల్ ఫోన్ కి షిఫ్ట్ అయితే కనుక గూగుల్ ఫోటోస్ లో స్టోర్ అయిన ఫోటోలను ఐక్లౌడ్ లో చూడడం అనేది కుదరదు. దాని కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది. గూగుల్ ఫోటోస్ లో ఉన్న ఫోటోలను ఐఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని దాన్ని మళ్ళీ ఐక్లౌడ్ లోకి అప్లోడ్ చేయాల్సి వచ్చేది. ఇదంతా పెద్ద ప్రక్రియ. అయితే గూగుల్ టేకవుట్ అప్గ్రేడ్ తో యాపిల్ యూజర్లు ఇప్పుడు సులువుగా గూగుల్ ఫోటోస్ లో ఉన్న ఫోటోలను, వీడియోలను ఐక్లౌడ్ లోకి ఫోటోస్ లోకి ట్రాన్స్ఫర్ లేదా బ్యాకప్ చేసుకోవచ్చు. గూగుల్, యాపిల్ కంపెనీలు కొత్త టూల్ ని పరిచయం చేశాయి. గూగుల్ ఫోటోస్ నుంచి మీడియా ఫైల్స్ ని ఐక్లౌడ్ కి ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా కొత్త టూల్ నైతే తీసుకొచ్చాయి.

గూగుల్ ఫోటోస్ నుంచి ఐక్లౌడ్ లోకి డేటా ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి?:

  • ముందు ఐక్లౌడ్ స్టోరేజ్ సరిపడా ఉందో లేదో చూసుకోవాలి. గూగుల్ ఫోటోస్ స్టోరేజ్ ఫ్రీగా 15 జీబీ ఉంటుంది. ఐక్లౌడ్ కి వచ్చేసరికి 5 జీబీ ఫ్రీ ఉంటుంది. కాబట్టి స్టోరేజ్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోండి.
  • యాపిల్ డివైజ్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లి మీ పేరు ఉన్న దాని మీద క్లిక్ చేసి ఐక్లౌడ్ లోకి వెళ్ళాలి. ఐక్లౌడ్ ఫోటోస్, ఐక్లౌడ్ డ్రైవ్ రెండిటినీ ఎనేబుల్ చేయాలి.
  • వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ టేకవుట్ అని టైప్ చేయాలి. లేదా టేకవుట్.గూగుల్.కామ్ లోకి వెళ్ళాలి. ఇది మీ గూగుల్ ఫోటోస్ సహా వివిధ గూగుల్ సర్వీసుల్లో ఉన్న డేటాను వేరే వాటిలోకి ఎక్స్ పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది.
  • గూగుల్ టేకవుట్ లో గూగుల్ ఫోటోస్ ఫర్ ఎక్స్ పోర్ట్ అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి. దీంతో గూగుల్ ఫోటోస్ లో ఉన్న ఫోటోలు, వీడియోలు ఎక్స్ పోర్ట్ అవుతాయి.
  • ఆ తర్వాత ‘యాపిల్-ఐక్లౌడ్ ఫోటోస్’ ఆప్షన్ ని ఎంచుకోవాలి. దీంతో గూగుల్ ఫోటోస్ లో ఉన్న డేటా ఐక్లౌడ్ లోకి వచ్చే వీలు ఉంటుంది.
  • అయితే ఏ అకౌంట్ ఐక్లౌడ్ ఫోటోస్ లో గూగుల్ ఫోటోస్ రావాలి అనే దాని కోసం మీరు యాపిల్ ఐడీతో సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది.
  • గూగుల్ ఫోటోస్ లో ఉన్న డేటా ఐక్లౌడ్ లోకి ట్రాన్స్ ఫర్ అయ్యేందుకు కావాల్సిన అనుమతులు ఇస్తే అప్పుడు ఎక్స్ పోర్ట్ ప్రక్రియ మొదలవుతుంది. అలా మీ గూగుల్ ఫోటోస్ లో ఉన్న ఫోటోలు, వీడియోలను ఐక్లౌడ్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. అప్పుడు అన్ని ఫోటోలు, వీడియోలు ఒకే చోట ఉంటాయి.