సంక్రాంతి పండుగ సందర్భంగా.. దక్షిణ మధ్య రైల్వే అధికారులు 16 అదనపు రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు సొంతూళ్లకు వెళ్లడానికి ఇప్పటికే ట్రైన్ టికెట్స్ బుక్ చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు.
కొందరు ప్రయాణికులకు ట్రైన్స్లో సీట్లు ఖాళీ లేక బుక్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది.
అయితే.. అలాంటి ప్రయాణికులు చింతించాల్సిన అవసరం లేదని.. అదనపు రైళ్లను నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి ఏపీలోని శ్రీకాకుళానికి, శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్ వరకూ ఈ అదనపు రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ట్రైన్ నంబర్. 07288/07290//07292/07293.. ఈ నాలుగు రైళ్లు సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వెళతాయి.
ఈ స్పెషల్ ట్రైన్స్.. చర్లపల్లి, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి మీదుగా శ్రీకాకుళం రోడ్ స్టేషన్కు చేరుకుంటాయి.
ట్రైన్ నంబర్ 07294/07295 ట్రైన్స్ లింగంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి మీదుగా శ్రీకాకుళం రోడ్ స్టేషన్కు చేరుకుంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.


































