బరువు తగ్గాలంటే ప్రతిరోజూ జిమ్‌కి వెళ్లడం, డైట్ ప్రకారం తినడం, బయట ఫుడ్ మానేయడం వంటి చాలా త్యాగాలు చేయాలి. అయితే జిమ్‌కి వెళ్లడం, డైట్‌ని సక్రమంగా ఫాలో అవ్వడం అందరికీ సాధ్యం కాదు.
ఇలాంటి వారు సులువుగా బరువు తగ్గాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది. అవేంటంటే..
బరువు తగ్గించుకోవాలంటే డైటింగ్ మించిన మరో మార్గం లేదు. అయితే అందుకు ఆహారంలో ప్రత్యేక మార్పులు చేయవలసిన అవసరం లేదు. ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినాలి. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. అలాగే కొవ్వు పేరుకుపోదు.పెరుగు, కిమ్చి, కొంబుచా వంటి ప్రోబయోటిక్ ఆహారాలను తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. దీంతో బరువు తగ్గడం సులువవుతుంది.ఇంట్లో తయారుచేసిన ఆహారం ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చు. అయితే వంట చేసేటప్పుడు నూనె, ఉప్పు, పంచదార తక్కువగా వాడాలి. ఇది శరీరంలో తక్కువ కేలరీలను ప్రవేశపెడుతుంది.
బరువు తగ్గాలంటే నిద్ర కూడా చాలా అవసరం. నిద్రలేమి ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలను కలిగిస్తుంది. శరీర ఆరోగ్యాన్ని, సరైన శరీర బరువును నిర్వహించడానికి రాత్రిళ్లు 7-8 గంటల నిద్ర అవసరం. నిద్ర పట్టకపోతే శారీరక సమస్యలు పెరుగుతాయి. ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలోని హార్మోన్ల సమతుల్యత పోతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి జిమ్ కి వెళ్లకపోయినా మనస్సును అదుపులో ఉంచుకోవడానికి యోగా చేయాలి.
బరువు తగ్గేటప్పుడు తక్కువ ఆహారం తీసుకోవాలని అందరూ అనుకుంటారు. ఈ పొరపాటు అస్సలు చేయకండి. శరీరంలో పోషకాహార లోపం తలెత్తితే బరువు తగ్గడం కష్టం. శరీరానికి అవసరమైన పోషకాహారం సరిపడా ఇవ్వకపోతే బరువు తగ్గకపోగా శారీరక సమస్యలు మరింత పెరుగుతాయి.
అలాగే నీరు పుష్కలంగా తాగాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. తగినంత నీరు త్రాగడం వల్ల బరువు తగ్గడం చాలా సులభం అవుతుంది. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి.