పరగడుపున మునగాకు నీటిని తాగితే.. ఊహించని ప్రయోజనాలు మీ సొంతం

మునగాకు లో విటమిన్లు ఎ, సి, ఇ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. మునగాకు నీళ్ళు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉండే మునగాకు నీళ్ళు జలుబు, దగ్గు, జ్వరం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మునగాకు నీళ్ళు తాగడం వల్ల జీవక్రియ పెరిగి, ఆకలి తగ్గి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

మునగ చెట్టులో ఎవరూ ఊహించని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆయుర్వేదంలో మునగాను అనేక చికిత్సలకు ఔషధంగా ఉపయోగిస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. మునగను పోషకాహార శక్తి కేంద్రంగా చెబుతారు.మునగాకు, కాయల వాడకంతో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువును నియంత్రిస్తుంది. పోషకాలతో నిండిన మునగాకు నీళ్ళు రోజు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

మునగాకు లో విటమిన్లు ఎ, సి, ఇ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. మునగాకు నీళ్ళు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉండే మునగాకు నీళ్ళు జలుబు, దగ్గు, జ్వరం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మునగాకు నీళ్ళు తాగడం వల్ల జీవక్రియ పెరిగి, ఆకలి తగ్గి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

మలబద్ధకం, విరేచనాలు, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో మునగాకు నీళ్ళు సహాయపడుతాయి. మునగాకు నీళ్ళలో ఐసోథియోసైనేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. పాలీఫెనాల్, టానిన్లు, సాపోనిన్లు వంటివి మునగాకులో ఉంటాయి. రక్తపోటును తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలు మునగాకులో ఉంటాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.