1995లో ఒక నిమిషం ఫోన్ కాల్ ఖరీదెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, ఉచిత కాల్స్ సౌకర్యం ఉంది. కానీ, భారతదేశంలో మొబైల్ ఫోన్ల ప్రయాణం ప్రారంభమైంది కేవలం మూడు దశాబ్దాల క్రితమే. భారతదేశంలో మొబైల్ ఫోన్ల అధికారిక ప్రయాణం జూలై 31, 1995న ప్రారంభమైంది.


ఆ రోజు అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, దివంగత జ్యోతి బసు, కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి సుఖ్ రామ్‌తో నోకియా మొబైల్ ఫోన్ ఉపయోగించి మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్ చేసి చరిత్ర సృష్టించారు. ఈ కాల్ మోడీ టెల్స్ట్రా నెట్‌వర్క్ ద్వారా కనెక్ట్ అయింది.

కాల్ ఛార్జీలు షాకింగ్:

మొబైల్ ఫోన్లు అప్పుడప్పుడే ప్రజలలో ప్రాచుర్యం పొందుతున్న సమయంలో, కాల్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉండేవి. ఆ కాలంలో, ఒక నిమిషం కాల్ ఖర్చు రూ. 8.4 ఉండేది. ఇక పీక్ అవర్స్‌లో, ఈ కాల్ ఛార్జీలు రెట్టింపు అయి ఏకంగా రూ. 16.8కు చేరేవి. నేటి కొనుగోలు శక్తిని బట్టి చూస్తే, ఆ విలువ దాదాపు రూ. 170 ఉంటుంది. అంత ఖరీదైన కాల్స్ చేసిన రోజులు ఉండేవి.

జియో విప్లవం:

2016లో ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ద్వారా టెలికాం రంగంలోకి ప్రవేశించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. జియో ప్రవేశం టెలికమ్యూనికేషన్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా మొబైల్ కాల్‌లను దాదాపు ఉచితం చేసింది. జియో రాక తర్వాత, ప్రపంచంలోనే అత్యల్ప మొబైల్ టారిఫ్ ప్లాన్లు, ఇంటర్నెట్ సర్వీస్ ఛార్జీలు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటిగా మారింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.