యూట్యూబ్‌లో షార్ట్ వీడియోలకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో కీలక మార్పు చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
సాధారణంగా యూట్యూబ్ షార్ట్స్‌లో ఇంటర్‌ఫేస్‌ని పరీక్షిస్తోంది.
ప్రస్తుతం యూట్యూబ్ షార్ట్స్‌కి డిజ్‌లైక్ ఆప్షన్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఆప్షన్‌ను తొలగించనున్నారని తెలుస్తోంది. ఇందుకు బదులుగా సేవ్ బటన్‌ను తీసుకురానున్నారని తెలుస్తోంది.
ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం.. యూట్యూబ్‌లో ఇకపై డిజ్‌లైక్ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ ఇప్పటికే కొందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్లందరికీ అమలు చేయనున్నారు.
దీంతో షార్ట్స్‌ను సులభంగా సేవ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. సేవ్ ఆప్షన్ నొక్కగానే మీరు దీన్ని ఇప్పటికే ఉన్న ప్లేజాబితాకు సేవ్ చేయాలనుకుంటున్నారా లేదా కొత్త ప్లేజాబితాని సృష్టించాలనుకుంటున్నారా అని యూట్యూబ్ అడుగుతుంది.
ఇదిలా ఉంటే షార్ట్స్‌లో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 60 సెకండ్ల నిడివి ఉన్న షార్ట్స్ లిమిట్‌ను 3 నిమిషాలకు పెంచిన విషయం తెలిసిందే. యూట్యూబ్ క్రియేటర్లకు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని మేకర్స్ తీసుకొచ్చారు.