ఏపీ విద్యా వ్యవస్థపై వైఎస్ జగన్ సంచలన పోస్ట్

ఆంధ్ర ప్రదేశ్ ( Andhra Pradesh) రాష్ట్ర విద్యా వ్యవస్థపై వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy ) సంచలన పోస్ట్ పెట్టారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ (Education system) అస్తవ్యస్తం అయిందని.. నిప్పులు జరుగుతూ ట్వీట్ చేశారు జగన్. విద్యాశాఖ చూసుకుంటున్న నారా లోకేష్ ను ( Nara Lokesh) ఉద్దేశించి… ఈ పోస్ట్ పెట్టారు. ఈసెట్ ఫలితాలు వచ్చి దాదాపు 45 రోజులు గడిచినప్పటికీ కూడా.. కౌన్సిలింగ్ ప్రారంభించలేదని ఫైర్ అయ్యారు.

అదే సమయంలో రేపటి నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు క్లాసులు కూడా ప్రారంభం కాబోతున్నట్లు గుర్తు చేశారు. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం అడ్మిషన్ల కోసం 35,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే… అందులో 31 922 మంది పాస్ అయినట్లు వెల్లడించారు. గత నెల మే 15వ తేదీన రిజల్ట్ వచ్చినప్పటికీ కూడా.. కౌన్సిలింగ్ ప్రక్రియ మాత్రం మొదలుపెట్టలేదని నిప్పులు చెరిగారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతారని ఫైర్ అయ్యారు. విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం ఇదే అంటూ ఫైర్ అయ్యారు. అంతేకాదు నారా లోకేష్ నిద్ర వదులు… విద్యా వ్యవస్థ పై దృష్టి పెట్టు అంటూ చురకులు అంటించారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.