హీరోయిన్ త్రిష గురించి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాధించుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో అనేక వివాదాల్లో ఇరుక్కుంటుంది. ముఖ్యంగా పలువురు ఈమెపై షాకింగ్ కామెంట్లు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇటీవలే ఈమెపై అన్నాడీఎంకే మాజీ సేలం యూనియన్ సెక్రటరీ ఏవీ రాజు త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె తాజాగా లీగల్ నోటీసులు పంపారు. ఆ వివరాలు ఏంటో మన ఇప్పుడు తెలుసుకుందాం.
హీరోయిన్ త్రిష తన ట్విట్టర్ వేధికగా ఈ నోటీసుల ఫొటోలను షేర్ చేసింది. ఈ నోటీసుల్లో త్రిష గురించి ఏవా రాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను లింకులలను కూడా షేర్ చేసింది. అలాగే ఆయన తన గురించి మాట్లాడిన మాటల గురించి కూడా వివరించారు. ఇలా తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏవీ రాజు.. నష్టపరిహారం చెల్లించాలని కూడా కోరినట్లు నోటీసుల్లో ఉంది. అయితే ఎంత అడిగారో మాత్రం చెప్పకుండా కవర్ చేశారు.
అలాగే ప్రస్తుతం త్రిష మానసిక వేదననను అనుభవిస్తోందని.. నోటీసులు జారీ చేసిన నాలుగు రోజుల్లోనే నష్టపరిహారాన్ని అందజేయాలని నోటీసుల్లో వెల్లడించారు. అంతేకాకుండా ప్రింట్ మీడియాతో పాటు, ఎలక్ర్టానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఇలా అన్ని చోట్ల.. త్రిషకు వ్యతిరేకంగా, అవమానకరంగా, పరువు నష్టం కల్గించే విధంగా చేసే కామెంట్లను తక్షణమే ఆపేయాలని స్పష్టం చేశారు.
షపై కామెంట్లు చేసిన వీడియోలు, వార్తలు వంటి వాటన్నిటినీ.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలతో పాటు సోషల్ మీడియాలో కూడా పూర్తిగా తొలగించాలని.. తమ సొంత ఖర్చుతో వీటన్నిటినీ తొలగించేలా చూసుకోవాలని వెల్లడించారు. ఈ నోటీసులు అందుకున్నప్పటి నుంచి 24 గంటల తర్వాత నుంచి త్రిషకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. నేరుగా కాకపోయినా ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా వేధికగా అయినా సారీ చెప్పాలని వివరించారు.
ఆయన సారీ చెబుతున్న వీడియోలను మీడియాలో చూపిస్తే మరింత మంచిదని.. ఈ నోటీసులపై స్పందించకపోయినా, సారీ చెప్పకపోయినా.. సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధం అని స్పష్టం చేశారు. ఈ నోటీసుల ప్రకారం నాలుగు రోజుల్లో ఏవీ రాజు స్పందించకపోయినా, సారీ చెప్పకపోయినా త్రిష ఈ కేసులో మరింత ముందుకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఏవీ రాజు దీనిపై ఎలా స్పందించనున్నారో చూడాలి. ఇదే విషయంపై నటుడు విశాల్ కూడా స్పందించారు. వీరి పేర్లు ప్రస్తావించకుండానే త్రిషకు మద్దతుగా మాట్లాడినట్లు అందరికీ అర్థం అవుతోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.