ప్రైవేటు టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్, జియో, వీఐలు జూలై నెల ప్రారంభంలో తమ రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఒక్కో ప్లాన్ మీద 11-25 శాతం వరకు టారిఫ్ రేట్లను పెంచాయి. ఈ పెంపుపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాక బ్యాన్ జియో.. బీఎస్‌ఎన్‌ఎల్ ఘర్‌వాప్సి అంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రైవేటు టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్స్ ధరలను పెంచిన నాటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారినట్లు తెలుస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది బీఎస్‌ఎన్‌ఎల్. కస్టమర్లకు అతి తక్కువ ధరలో.. ఎక్కువ రోజులు వ్యాలిడిటీ ఉండే రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొస్తుంది.
ఇతర నెట్‌వర్క్ కంపెనీలు ప్లాన్ రేట్లను పెంచినా బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం పెంచకుండా తక్కువ ధరల్లోనే రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. దీని కారణంగా చాలా మంది వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌కి మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే కస్టమర్ల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ 110 రూపాయాల లోపే రెండు బెస్ట్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. వీటిల్లో ఒక దాని రేటు 108, మరొకటి 107 రూపాయలు మాత్రమే. పైగా ఒక ప్లాన్ వ్యాలిడిటీ ఏకంగా 35 రోజులు కావడం గమనార్హం. ఆ వివరాలు..
రూ.108 ప్లాన్..
బీఎస్ఎన్ఎల్ తెచ్చిన అతి చౌకైన ప్లాన్‌లో ఒకటి రూ.108 రీఛార్జ్ ప్లాన్. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ మొత్తం నెలకు 28జీబీ డేటాను అందిస్తుంది. అంటే రోజుకు ఒక జీబీ డేటా అందిస్తుంది. అంతేకాక ఈ ప్లాన్ ద్వారా రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాలింగ్ సౌకర్యాలను పొందవచ్చు.
రూ.107 ప్లాన్..
బీఎస్ఎన్ఎల్ తెచ్చిన మరో చౌకైన ప్లాన్ రూ.107. ఇది వినియోగదారులకు 3 జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తోంది. దీంతో పాటు లోకల్, ఎస్టీడీ కాల్స్‌కి 200 నిమిషాలు ఉచితంగా ఇస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 35 రోజులు కావడం దీనికున్న మరో అదనపు ప్రయోజనం. వీటితో పాటు వినియోగదారులు 35 రోజులపాటు బీఎస్ఎన్ఎల్ ట్యూన్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు. మొత్తం మీద ధర, వాలిడిటీ పరంగా బీఎస్ఎన్ఎల్ రూ. 107 ప్లాన్‌కు పోటీ ఇచ్చేది.. మిగతా కంపెనీల్లో లేదు.
వీటితో పాటు అత్యంత తక్కువ ధరల్లో 30 రోజుల రీఛార్జ్ ప్రణాళికను కూడా అందిస్తుంది. దీని కోసం రూ.199 రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. ఇది 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ మొత్తం నెలకు 60జీబీ డేటాను అందిస్తుంది. అంటే రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాలింగ్ సదుపాయాలు కూడా అందిస్తోంది.