ఆటోమొబైల్ రంగం భారత్‌లో వేగంగా అభివృద్ది చెందుతోంది. తక్కువ ధరకే ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లకు మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉంది.
ప్రస్తుతం పెట్రోల్ ధరలు మండుతున్నాయి. ఇండియాలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. దీంతో పెట్రోల్ భారం కావడంతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులకు ఫుల్ డిమాండ్ ఉంది. మార్కెట్లో కూడా ఇలాంటి బైకులకే ఎక్కువ క్రేజ్ ఉండగా.. కంపెనీలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఒక కంపెనీని మించి మరో కంపెనీ తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో హోండా షైన్, బజాజ్ ప్లాటినా వంటి బైకులు ఎక్కువ మైలేజ్ ఇస్తున్నాయి.
68 కిలోమీటర్ల మైలేజ్
అయితే ఆ రెండు బైకులకు హీరో HF డీలక్స్ బైక్ గట్టి పోటీ ఇస్తోంది. ఈ బైక్ బేసిక్ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.55,992కే లభిస్తుంది. ఇక టాప్ వేరియంట్ అయితే ఎక్స్‌షోరూమ్ ధర రూ.68,485గా ఉంది. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 70 కిలోమీటర్ల అధిక మైలేజ్ ఇస్తుంది. ARAI సంస్థ కూడా దీనిని ధృవీకరించింది. ఇక హీరో మెటోకార్ప్ వెబ్‌సైట్‌లో కూడా 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అధిక మైలేజ్ ఇస్తుండటంతో ఈ బైక్ సేల్స్ భారీగా పెరిగిపోయాయి.
హీరో HF డీలక్స్ బైక్ ఫీచర్లు
ఈ బైక్‌కు పికప్ బాగుంటుంది. తక్షణ పికప్ ఉంటుంది. ఇక సైడ్ స్టాండ్ తీయకపోతే బైక్ ముందుకు కదలదు. దీంతో పాటు దీనికి LED హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెన్సార్ ఆధారిత Xsense FI టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ బైక్ 97.2సీసీ ఎయిర్ కూల్ట్ 4 స్ట్రోక్ సింగిల్ సిలండర్ OHC ఇంజిన్‌తో వర్క్ అవుతుంది. ఇంజిన్ అత్యధికంగా 5.9W శక్తిని, 8.05NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4 స్పీడ్ గేర్ బాక్స్‌తో ఇంజిన్ జతచేయబడింది.
అమ్మకాలు
హీరో HF డీలక్స్ బైక్‌లు 2024 అక్టోబర్‌లో 1,24,343 యూనిట్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో 1,13,398 విక్రయించారు.అంతే గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే 10,345 తక్కువ అమ్ముడుపోయాయి. నెంబర్ పరంగా ఇది చాలా చిన్నదే అయినా.. సేల్స్ మరింత పెంచుకునేందుకు సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.


































