ఏపీలోని విజయవాడ డివిజన్ పరిధిలో ఉన్న విజయవాడ-దువ్వాడ సెక్షన్ల పరిధిలో రాకపోకలు సాగించే పలు రైళ్లపై దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
నవంబర్ నెలలో ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసింది. ఇలా రద్దయిన రైళ్ల వివరాలు, రద్దు కావడానికి గల కారణాల్ని వెల్లడిస్తూ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో గుంటూరు నుంచి విశాఖ మధ్య ప్రయాణించే పలు రైళ్లు ఉన్నాయి.
రాజమండ్రి-విశాఖ మధ్య ప్రయాణించే రైలు నంబర్ 67285 ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేసారు. అలాగే విశాఖ నుంచి రాజమండ్రికి ప్రయాణించే రైలు నంబర్ 67286 ను కూడా నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేసారు. గుంటూరు నుంచి విశాఖకు ప్రయాణించే రైలు నంబర్ 17239(సింహాద్రి ఎక్స్ ప్రెస్) ను నవంబర్ 22 నుంచి 24 వరకూ రద్దు చేశారు. అలాగే విశాఖ నుంచి గుంటూరుకు ప్రయాణించే రైలు నంబర్ 17240 (సింహాద్రి ఎక్స్ ప్రెస్)ను నవంబర్ 23 నుంచి 25 వరకూ రద్దు చేసారు.
కాకినాడ పోర్టు నుంచి విశాఖకు ప్రయాణించే రైలు నంబర్ 17267ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేసారు. అలాగే విశాఖ నుంచి కాకినాడ పోర్టుకు ప్రయాణించే రైలు నంబర్17268 ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేసారు. విశాఖ నుంచి విజయవాడకు ప్రయాణించే రైలు నంబర్ 12717 (రత్నాచల్ ఎక్స్ ప్రెస్) ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేసారు. అలాగే విజయవాడ నుంచి విశాఖకు ప్రయాణించే రైలు నంబర్ 12718 (రత్నాచల్ ఎక్స్ ప్రెస్)ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేసారు.
వీటితో పాటు సీఎస్ఎంటీ ముంబై నుంచి భువనేశ్వర్ కు ప్రయాణించే రైలు నంబర్ 11019ను నవంబర్ 21న 180 నిమిషాల పాటు ఆలస్యంగా రీషెడ్యూల్ చేశారు. ధన్ బాద్ నుంచి అలప్పుజకు వెళ్లే రైలు నంబర్ 13351ను నవంబర్ 24న 180 నిమిషాల పాటు రీషెడ్యూల్ చేశారు. అలాగే హతియా నుంచి ఎర్నాకుళం వెళ్లే రైలు నంబర్ 22837ను కూడా 160 నిమిషాల పాటు రీషెడ్యూల్ చేశారు.
































