కొడుకు భవిష్యత్తుకోసం రాత్రంతా 800 కి.మీ. డ్రైవ్‌

నీవినీ ఎరుగని రీతిలో ఇండిగో విమానాల రద్దు, ప్రయాణీకుల కష్టాలకు సంబంధించిన ఇప్పటికే పలు హృదయవిదారక కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ.


హరియాణాలోని రోహ్‌తక్ నుండి పంఘల్ కుటుంబాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. కుమారుడి పరీక్ష కోసం తండ్రి చేసిన సాహసం వైరల్‌గా మారింది.

హర్యానాలోని రోహ్‌తక్‌కు చెందిన యువ షూటర్ ఆశీష్ చౌధరిపంఘాల్, ఇండోర్‌లోని డాలీ కళాశాలలో 12వ తరగతి చదువుతున్నాడు. ప్రీ-బోర్డ్​ పరీక్ష (XII ) రాసేందుకు ఇండోర్‌కు వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ నుండి విమానాశ్రయానికి వెళ్లాలని ‍ ప్లాన్‌. కానీ అనూహ్యంగా ఇండిగో విమాం రద్దు అయింది.

రైలులో సీటు అందుబాటులో లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని తండ్రి రాజ్‌నారాయణ్ పంఘాల్‌ సాహసపోతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన కొడుకు పరీక్షకు హాజరుకావాలంటే రాత్రంతా కారులో ప్రయాణించాలని ఎంచుకున్నాడు. దాదాపు 800కిలోమీటర్లు కారులో ప్రయాణించి కాలేజీకి చేరుకున్నాడు. సరిగ్గాపరీక్ష సమయానికి ఇండోర్‌కు చేరడం విశేషంగా నిలిచింది.

దీనిపై తండ్రి రాజ్ నారాయణ్ స్పందిస్తూ డిసెంబర్ 8న పరీక్షలు రాయాల్సి ఉంది. అంతకుముందు, డిసెంబర్ 6 సాయంత్రం ఇండోర్‌లోని కళాశాలలో అబ్బాయికి సత్కారం జరగాల్సి ఉంది. ఢిల్లీ నుండి ఇండోర్‌కు అతని విమానం ఇప్పటికే బుక్ చేశాం. అతణ్ని ఢిల్లీ విమానాశ్రయంలో దింపడానికి వెళ్ళాను, విమానం రద్దు కావడంతో సత్కారం మిస్‌ అయింది. కానీ పరీక్ష మిస్‌ కాకూడదనే ఉద్దేశంతోనే తానీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సమయానికి తీసుకెళ్ల గలిగాను అంటూ ఊపిరిపీల్చుకున్నారు. దీంతో గ్రేట్‌ ఫాదర్‌, నాన్న ప్రేమ అలా ఉంటుంది అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.