Gold Rate: గోల్డ్ @ 71000.. నేడు కళ్లు తిరిగే రేటుకు పసిడి పరుగు.. ఇంకెంత కాలం..??

www.mannamweb.com


Gold Price Today: ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధరలతో ప్రజలు కళ్లతో చూసి ఆనందపడటమే తప్ప చేతితో కొనుక్కోలేని పరిస్థితులు నెలకొన్నాయి. పసిడి రేటు పరుగులకు హద్దు అదుపు లేకుండా పోవటంతో నేడు దాదాపు 10 గ్రాముల ధర సరికొత్త గరిష్ఠమైన రూ.71 వేల మార్కుకు చేరుకుంది.
దీంతో దేశంలోని పసిడి ప్రియుల కళ్లలో బాధ కనిపిస్తోంది. వేగంగా పెరుగుతున్న బంగారం ధరలు అసలు ఏ కారణంగా పెరుగుతున్నాయి, ఇంకెంత కాలం ఈ ధోరణి కొనసాగుతుందనే ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఈ ఏడాది మధ్యలో వడ్డీ రేట్లను సెంట్రల్ బ్యాంకులు తగ్గించే అవకాశాలు కనిపిస్తుండటంతో పెట్టుబడిదారులు తమ డబ్బును పసిడి, వెండిలోకి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఊహించని రీతిలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. ఇది సాధారణ ఆభరణాల కొనుగోలుదారుల జేబులకు పెద్ద కన్నం వేస్తున్నాయి.

నేడు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.750 పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.65,000, దిల్లీలో రూ.64,250, ముంబైలో రూ.64,100, కలకత్తాలో రూ.64,100, కేరళలో రూ.64,100, బెంగళూరులో రూ.64,100, వడోదరలో రూ.64,150, జైపూరులో రూ.64,250, మంగళూరులో రూ.64,100, నాశిక్ లో రూ.64,130, అయోధ్యలో రూ.64,250, బళ్లారిలో రూ.64,100, గురుగ్రాములో రూ.64,250, నోయిడాలో రూ.64,250 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నేడు నిన్నటితో పోల్చితే రూ.760 పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.70,910, దిల్లీలో రూ.70,020, ముంబైలో రూ.69,870, కలకత్తాలో రూ.69,870, కేరళలో రూ.69,870, బెంగళూరులో రూ.69,870, వడోదరలో రూ.69,920, జైపూరులో రూ.70,020, మంగళూరులో రూ.69,870, నాశిక్ లో రూ.69,900, అయోధ్యలో రూ.70,020, బళ్లారిలో రూ.69,870, గురుగ్రాములో రూ.70,020, నోయిడాలో రూ.70,020గా ఉన్నాయి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.64,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.69,870 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.2000 పెరిగి రూ.84,000 వద్ద కొనసాగుతోంది.