చెట్లకు కుర్చీలు పెంచుతున్న రైతు.. ఇప్పుడు ఆర్డర్‌ చేస్తే ఏడేళ్లకు డెలివరీ..!

www.mannamweb.com


 

ప్రపంచం అద్భుతాలు, సాహసాల వైపు పరుగులు పెడుతుంది. ఒకరిని మించి ఒకరు కొత్తకొత్త విషయాలను కనిపెడుతున్నారు, సృష్టిస్తున్నారు. పొలాల్లో కూరగాయలు, పండ్లు పండించడం మనకు తెలుసు.. కుర్చీలు పండించడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. కుర్చీలను చెట్లతో తయారు చేస్తారు.. కానీ ఏకంగా చెట్లకే కుర్చీలను పండిస్తే.. ఇంకా అర్థంకాలేదా.. అయితే ఈ కథ మొత్తం చదవాల్సిందే..!
గావిన్ మున్రో అనే వ్యక్తి తన పొలంలో కుర్చీలు పెంచుతుంటాడు. అతను ఇంగ్లాండ్‌లోని డెర్బీషైర్ డీల్స్ నివాసి. ఈ విచిత్రమైన వ్యవసాయానికి చాలా సమయం మరియు శ్రమ పడుతుంది, కానీ లాభం చాలా ఉంది, వినేవారికి కూడా ఇలాంటి వ్యాపారం చేయాలని అనిపిస్తుంది. అతను తయారు చేసిన కుర్చీలకు చాలా దేశాల్లో డిమాండ్ ఉంది. పొలాల్లో పండే ఈ కుర్చీల ధర లక్షల్లో ఉంటుంది.
గావిన్ కలపను కత్తిరించి తయారు చేసే కుర్చీలను నేరుగా చెట్లపై పెంచుతారు. ఇది చెట్లకు వేలాడుతున్న పండులా కనిపిస్తుంది. దీని కోసం, గావిన్ విల్లో అనే ప్రత్యేక చెట్టును ఉపయోగిస్తాడు. విల్లో చెట్టు కొమ్మలు చాలా సరళంగా ఉంటాయి. అదేవిధంగా, ఓక్, యాష్ మరియు సైకమోర్ వంటి బలమైన తీగలు ఉన్న చెట్లను కూడా ఫర్నిచర్ పెంచడానికి ఉపయోగిస్తారు. చెట్ల తీగలను కుర్చీలుగా మార్చడానికి గావిన్ ఇనుప ఫ్రేమ్‌లను ఉపయోగిస్తాడు. ఈ ఫ్రేమ్‌ల లోపల చెక్క కుర్చీని అమర్చి పెంచుతారు. కుర్చీల ఆకారం చెడిపోకుండా ఉండటానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చెట్టు కత్తిరిస్తాడట.
ఒక్క కుర్చీ ఖరీదు రూ.6 నుంచి 7 లక్షలు
గావిన్ భార్య ఆలిస్ కూడా అతడి వ్యాపారంలో సమానంగా సాయం చేస్తుంది. కుర్చీలు తయారు చేయడానికి సమయం పడుతుంది, కాబట్టి ఎవరైనా కుర్చీలు కొనాలనుకుంటే, కనీసం 7 సంవత్సరాల ముందుగానే ఆర్డర్ చేస్తారు. 5-6 సంవత్సరాలలో కుర్చీలు అందుబాటులో ఉంటాయి. ఒక్కో కుర్చీ ఖరీదు రూ.6 నుంచి 7 లక్షలు ఉంటుందట. ఈ విషయం విన్నాకా.. మీకు నవ్వాలో ఏడ్వాలో అర్థంకావడం లేదా..! చెట్లకు కుర్చీలను పండించడమే ఒక వింత అంటే.. వాటిని ఇన్ని లక్షలు పోసీ కొనడం ఇంకో వింత..!నిజంగా ఈ ఐడియా ఆ గావిన్‌కు ఎలా వచ్చిందో..! అని విషయం తెలిసిన నెటిజన్లు అంటున్నారు.. మీరేమంటారో..!