Eye Vision Exercises: కంటి చూపుకు పదును పెట్టే ఎక్సర్‌సైజ్‌లు.. రోజుకు రెండు సార్లు చేశారంటే..

www.mannamweb.com


వయసు పెరిగే కొద్దీ కంటిచూపు మందగింజడం సహజం. అయితే అతి చిన్న వయసులోనే కంటి పవర్ రోజురోజుకు తరిగిపోతుంటే మాత్రం వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా నేటి కాలంలో ఎలక్ట్రిక్‌ గాడ్జెట్స్ కారణంగా చాలా మందికి అనేక రకాల కంటి సమస్యలు వస్తున్నాయి.

రోజంతా ల్యాప్‌టాప్, ఫోన్‌తో కూర్చోవడమే అందుకు కారణం. అయితే ఈ కింది కంటి వ్యాయామాలు చేస్తే కంటిచూపు బాగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..

గతితప్పిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ రోజుల్లో అన్ని వయసుల వారికి కంటి చూపు మందగిస్తుంది. అటువంటి పరిస్థితులలో ప్రత్యేక కంటి సంరక్షణ అవసరం. అలాగే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, ముడతలు ఏర్పడుతున్నాయి. కాబట్టి వీటిని నివారించడానికి క్రమం తప్పకుండా కంటి వ్యాయామాలు చేయాలి.

కొన్ని నిమిషాల పాటు వేళ్లతో కనురెప్పను తేలికగా నొక్కాలి. తర్వాత కనురెప్పపై వేలితో ఒకసారి సవ్యదిశలో, మరోసారి అపసవ్య దిశలో తిప్పుతూ ఉండాలి. పని చేస్తున్నప్పుడు ఒక్కోసారి కళ్ళు నొప్పిగా ఉంటాయి. ఆ నొప్పి క్రమంగా తలనొప్పిగా మారుతుంది. కొన్ని నిమిషాల పాటు ఈ వ్యాయామం చేయడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

కళ్లకు ఫోకస్ చేయడం, రొటేషన్, పైకి క్రిందికి చూడటం వంటి వ్యాయామాలు కూడా చేయవచ్చు. ఈ వ్యాయామం కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది నల్లటి వలయాలను కూడా తొలగిస్తుంది.

ఈ వ్యాయామం రోజుకు రెండుసార్లు లేదా మీకు సమయం దొరికినప్పుడల్లా చేయవచ్చు. అయితే కంటి చూపు మెరుగుపడాలంటే రాత్రి పూట ఫోన్ వాడకాన్ని నివారించాలి.