Summer Weight Loss Plan: బరువు తగ్గాలనుకునే వారికి వేసవికాలం ఓ మంచి అవకాశం అనే చెప్పాలి. ఎందుకంటే వ్యాయామం చేసే సమయంలో శరీరం నుండి బయటకు వెళ్లే చెమట ద్వారా బరువు తగ్గుతారు. అంతేకాదు ఎండాకాలంలో కొన్ని ఆహారపదార్థాలు తినడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయట. సమ్మర్ లో కొన్ని కూరగాయలను తీసుకోవడం వల్ల శరీరంలోని ఫ్యాట్ బర్న్ అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
ముల్లంగి :
వేసవికాలంలో పండ్లతో పాటు కూరగాయలను కూడా తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ముల్లంగి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముల్లంగిలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అంతేకాదు తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. అంతువల్ల సమ్మర్ డైట్ లో ముల్లంగిని తినడం వల్ల బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వాము ఆకులు :
ఎండాకాలంలో బరువును తగ్గించడానికి వాము ఆకులు బాగా సహకరిస్తాయట. కేలరీలు తక్కువగా ఉండే వీటిలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుందట. దీనిని సలాడ్స్, సూప్స్ లలో ఉపయోగించుకుని తినాలి.
టమాటాలు :
టమాటల్లోను వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇందుల్లో ఉంటే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గించడానికి తోడ్పడుతాయి. అందువల్ల సమ్మర్ డైట్ లో టమాటోలను ఉపయోగించడం వల్ల జీవక్రియ రేటును పెంచి బరువును తగ్గిస్తుంది. అంతేకాదు టమాటోలను జ్యూస్ రూపంలో తీసుకున్నా కూడా బరువు తగ్గొచ్చు. ఈ మేరకు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ఓ నివేదికను వెల్లడించింది. 12 వారాల పాటు రోజుకు 2 టమాటోలను తినడం వల్ల దాదాపు 0.7 కిలోల మేరకు బరువు తగ్గే అవకాశాలు ఉంటాయట. టమాటోలు తినడం వల్ల శరీరంలోని చెడు కొలస్ట్రాల్ స్థాయిలు తగ్గి బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.
క్యారెట్ :
క్యారెట్లు ఆరోగ్యం, చర్మ సౌందర్యంతో పాటు బరువు తగ్గడానకి కూడా తోడ్పడతాయి. క్యారెట్ లో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గించి ఎక్కువ సేపు ఎనర్జీతో ఉండేలా చేస్తుంది.