అంతరిక్షానికి వెళ్తున్న తొలి తెలుగు వ్యక్తి.. ఎవరీ గోపీచంద్ తోటకూర..

అంతరిక్షంలోకి వెళ్లే తొలి వ్యక్తిగా గోపిచంద్ తోటకూర నిలవనున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ రూపొందించిన న్యూ షెపర్డ్ మిషన్‌లో అంతరిక్షంలోకి దూసుకెళ్లే ఆరుగురు సభ్యుల సిబ్బందిలో గోపిచంద్ కూడా ఒక్కరు. ఈ మేరకు బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రకటన చేసింది. 1984లో భారత్‌కు చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అంతరిక్షయానం చేసిన సంగతి తెలిసిందే. అయితే న్యూ షెపర్డ్ మిషన్ విజయవంతం అయితే.. అంతరిక్షంలో వెళ్లిన రెండవ భారతీయ పౌరుడిగా గోపిచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు.
అంతరిక్షంలోకి వెళ్లే తొలి వ్యక్తిగా గోపిచంద్ తోటకూర నిలవనున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ రూపొందించిన న్యూ షెపర్డ్ మిషన్‌లో అంతరిక్షంలోకి దూసుకెళ్లే ఆరుగురు సభ్యుల సిబ్బందిలో గోపిచంద్ కూడా ఒక్కరు. ఈ మేరకు బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రకటన చేసింది. 1984లో భారత్‌కు చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అంతరిక్షయానం చేసిన సంగతి తెలిసిందే. అయితే న్యూ షెపర్డ్ మిషన్ విజయవంతం అయితే.. అంతరిక్షంలో వెళ్లిన రెండవ భారతీయ పౌరుడిగా గోపిచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. అలాగే అంతరిక్షంలోకి వెళ్లిన భారతదేశ మొదటి పౌర వ్యోమగామిగా నిలవనున్నారు.
వ్యోమగాములు కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజా చారి, శిరీష బండ్ కూడా అంతరిక్ష ప్రయాణాలు చేసినప్పటికీ.. వారంతా భారత సంతతికి చెందిన యూఎస్ పౌరులు. అయితే గోపిచంద్ తోటకూర విషయానికి వస్తే.. అతడు ప్రస్తుతం యూఎస్‌లో ఉంటున్నప్పటికీ ఇండియన్ పాస్‌పోర్టును కలిగి ఉన్నారు. అయితే న్యూ షెపర్డ్ మిషన్‌ను ప్రారంభించే తేదీని బ్లూ ఆరిజిన్ సంస్థ ఇంకా ప్రకటించలేదు. కానీ రాబోయే కొద్ది వారాల్లో దీనిని చేపట్టే అవకాశం ఉంది.
విజయవాడకు చెందినవాడే..
గోపిచంద్ తోటకూర విజయవాడలో జన్మించారు. అమెరికాలో ఆరోనాటికల్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఆయన కమర్షియల్‌ జెట్‌ పైలట్‌గా పని చేశారు. ప్రస్తుతం అట్లాంటా శివార్లలో అభివృద్ధి చేయబడుతున్న వెల్నెస్ సెంటర్ అయిన ప్రిజర్వ్ లైఫ్‌కు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఇది లక్షల డాలర్లతో రూపుదిద్దుకుంటుంది. అయితే గోపిచంద్ తోటకూర అమెరికాలో ఉంటున్నప్పటికీ.. అతని భారతీయ పాస్‌పోర్ట్‌ను నిలుపుకున్నారు.
ఒక పౌరుడిగా అంతరిక్షంలోకి తన ప్రయాణం.. భారతీయ పిల్లలకు వ్యోమగామిగా ఉండాలనే ఆలోచనను మరింత అందుబాటులోకి తెస్తుందని తాను ఆశిస్తున్నట్లు గోపిచంద్ తోటకూర ఈటీకి చెప్పారు. ఎనిమిదేళ్ల వయసులో కేఎల్‌ఎం విమానం కాక్‌పిట్‌ను సందర్శించినప్పటి నుంచి తాను ఏరోస్పేస్ పట్ల ఆకర్షితుడయ్యానని తెలిపారు. గోపిచంద్ తోటకూర.. దాదాపు ఒక దశాబ్దం క్రితం భారతదేశంలో మెడికల్ ఎయిర్-ఎక్యూయేషన్ సర్వీస్‌ను నడిపారు.
ఇక, తాను అంతరిక్ష ప్రయాణం చేయబోతున్నాననే విషయం బ్లూ ఆరిజిన్ అధికారిక ప్రకటన చేసిన తర్వాతనే తన కుటుంబానికి తెలిసిందని గోపిచంద్ తోటకూర చెప్పారు. వారు ఉద్వేగభరితంగా ఉన్నారని తెలిపారు. ఇదిలాఉంటే, బ్లూ ఆరిజిన్ సంస్థ ఆరు మిషన్‌ల ద్వారా మొత్తం 31 మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వీరంతా భూమి- అంతరిక్షం మధ్య సరిహద్దు, సముద్ర మట్టానికి 80 నుంచి 100 కి.మీ ఎగువన ఉండే కార్మాన్ రేఖను దాటి వెళ్లారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *