వణుకు పుట్టే చిత్రం.. ఫ్రీగానే చూడచ్చు.. సెన్సిటివ్ పీపుల్ చూడొద్దు

www.mannamweb.com


హారర్ చిత్రాలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. వెన్నులో వణుకుపుట్టించే చిత్రాలను చూడందే వారిక నిద్ర పట్టదు. కొందరు అయితే చీకటి పడగానే ఒక హారర్ చిత్రం అయినా చూడాలి అనుకుంటారు. అలాంటి వారి కోసం ది బెస్ట్ హారర్ చిత్రం ఒకటి తీసుకొచ్చాం. నిజానికి ఇది పెద్ద చిత్రం కాదు.. షార్ట్ ఫిల్మ్. కేవలం 10 నిమిషాలే ఉంటుంది. దీనిని మీరు ఫ్రీగానే చూసేయచ్చు. కానీ, ఆ 10 నిమిషాలు మీరు ఒక బిగ్ స్క్రీన్ మీద ఏ ఈవిల్ డెడ్ సినిమా చూస్తున్న ఫీల్ ఉంటుంది. ఒక షార్ట్ ఫిల్మ్ ని ఈ రేంజ్ లో ప్రెజెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే దీనిని సెన్సిటివ్ పీపుల్ చూడకపోవడమే మంచిది.

ఇప్పటి వరకు భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న షార్ట్ ఫిల్మ్స్ చాలానే ఉన్నాయి. అందులో ఈ సినిమా పేరును కూడా చేర్చచ్చు. ఎందుకంటే హారర్ ఎలిమెంట్ తో అదిరిపోయే ఫినిషింగ్ తో.. బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తూ తీసుకురావడం అయితే మామూలు విషయం కాదు. ఈ సినిమా మొత్తం ఒకే గదిలో జరుగుతుంది. అది కూడా నలుగురు అమ్మాయిల మధ్య జరుగుతుంది. ఈ మూవీ 1983లో జరిగినట్లుగా చెప్తారు. ఆ నలుగురు అమ్మాయిలు నైట్ ఔట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. దానికి తగినట్లుగా ప్లాన్ కూడా చేసుకుంటారు. అంతా గదిలో మంచి లైటింగ్ సెట్ చేసుకుంటారు.

ఆ తర్వాత మంచి మ్యూజిక్ ని పెట్టుకుని.. రాత్రి ఏం చేయాలి అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్లు ఆర్డర్ చేసిన పిజ్జా డెలివరీ వస్తుంది. అది తింటూ వారి ఆలోచనలు షేర్ చేసుకుంటూ ఉంటారు. వారిలో ఒక అమ్మాయి ఆ పిజ్జాలో ఒక పీస్ తీసుకుని కొంచం తింటుంది. ఆ తర్వాత ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. చూస్తుండగానే.. వేరే గొంతులో మాట్లాడుతుంది. వాళ్ల ఫ్రెండ్స్ ని కూడా హర్ట్ చేయాలి అనే ఆలోచనలు వస్తాయి. తనకు ఏం జరుగుతోంది అనేది తనకు తెలియదు. చుట్టూ ఉన్న వాళ్లు తన ఫ్రెండ్స్ అనే విషయాన్ని అతి కష్టం మీద గుర్తు చేసుకుంటుంది. ఎంత కంట్రోల్ చేసినా తన శరీరం తన మాట వినదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే మీరు ఈ “పిజ్జా ప్యానిక్ పార్టీ” అనే షార్ట్ ఫిల్మ్ చూడాల్సిందే. ఈ లఘు చిత్రం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. అయితే వీక్ హార్ట్, సెన్సిటివ్ పీపుల్ మాత్రం ఈ చిత్రానికి దూరంగా ఉంటే మంచిది.