Drinking Water: నీళ్లు తాగిన తర్వాత కూడా దాహంగా ఉంటుందా? ఈ సమస్యలకు ముందస్తు సంకేతం కావచ్చు..

Why Am I Always Thirsty? know here reasons: నీరు శరీరానికి జీవనాధారం. అందుకే నీరు ఎక్కువగా తాగడం వల్ల అనేక రోగాలను దూరం చేసుకోవచ్చని నిపుణులు అంటుంటారు.
సాధారణంగా శరీరానికి నీరు అవసరమైతే అందరికీ దాహం వేస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత, మసాలాతో కూడిన ఆహారం తిన్న తర్వాత దాహం వేయడం సాధారణం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

కానీ నిరంతరం దాహంగా ఉండటం లేదా నీరు త్రాగిన తర్వాత కూడా దాహం తీరకపోవడం వంటి లక్షణాలు అనేక అనారోగ్య సమస్యలకు సూచికలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటంటే..

డీహైడ్రేషన్: వేసవిలో ఎండ వేడిమికి ఎక్కువగా చెమటలు పట్టడం వల్ల డీహైడ్రేషన్ సంభవిస్తుంది. అప్పుడు దాహం వేయడం, అతిసారా, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి.

Related News

దీనివల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ల నష్టానికి కారణం అవుతుంది. అలాగే పొడి చర్మం, పగిలిన పెదవులు, అలసట, మైకం కమ్మడం, వికారం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

మధుమేహం: మధుమేహం వల్ల కూడా అత్యధికంగా దాహం వేస్తుంది. ఈ వ్యాధితో బాధపడేవారు మూత్రవిసర్జన అధికసార్లు వెళ్తుంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, శరీరం దానిని మూత్రం ద్వారా తొలగించడానికి ప్రయత్నిస్తుంది. ఫలితంగా నిర్జలీకరణం జరుగుతుంది. దీని వల్ల దాహంగా అనిపిస్తుంటుంది.

డయాబెటిక్ కీటోయాసిడోసిస్: మధుమేహం ఉన్నవారికి శక్తిని అందించడానికి కణాలలోకి గ్లూకోజ్ చేరకుండా నిరోధించే సమస్య ఉంటుంది. ఇది శరీరంలో కీటోన్‌లను పెంచుతుంది. ఇది ఆమ్లంగా మారి.. కీటోయాసిడోసిస్‌కు దారితీస్తుంది. ఇది మూత్రవిసర్జనను బాగా ప్రభావితం చేస్తుంది. అలాగే దాహాన్ని పెంచుతుంది.

కీటోయాసిడోసిస్ అనేది ప్రాణాంతక సమస్య. పొడి చర్మం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, వాంతులు, మైకం కమ్మడం, కోమా వంటివి కెటోయాసిడోసిస్ ప్రధాన లక్షణాలు.

గర్భం: చాలా మంది గర్భిణీ స్త్రీలకు కూడా తరచుగా నీరు దాహంగా అనిపిస్తుంటుంది. ఇది సాధారణ సమస్య అయినప్పటికీ గర్భధారణ సమయంలో కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇది గర్భధారణ సమయంలో సంభవించే మధుమేహానికి సంకేతం కావచ్చు.

మెడిసిన్‌ దుష్ప్రభావాలు: అనారోగ్య కారణంగా వాడే కొన్ని ఔషధాల వల్ల కూడా అధికంగా దాహంగా ఉండవచ్చు. పార్కిన్సన్స్, ఆస్తమా, డయేరియా, యాంటీబయాటిక్స్, యాంటిసైకోటిక్స్, యాంటీ డిప్రెసెంట్స్ వంటి కొన్ని మెడిసిన్లకు దాహాన్ని కలిగించే లక్షణాలు ఉంటాయి. అలాగే స్కిజోఫ్రెనియా వంటి మానసిక రుగ్మతల వల్ల కూడా నాలుక పొడిబారి అధికంగా దాహం వేస్తుంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *