Barley Water: అమృతమే ఈ నీరు.. రోజూ ఒక గ్లాసు తాగారంటే ఈ సమస్యలకు దివ్యౌషధం.. వడదెబ్బ ప్రమాదమే ఉండదు..

www.mannamweb.com


సూరీడు ఏమాత్రం తగ్గడం లేదు.. 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. మే నెల రాక ముందే ఉష్ణోగ్రతలు ఇలా ఉంటే.. మున్ముందు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈక్రమంలో చాలా మంది డీ హైడ్రేషన్ తో వడదెబ్బ బారిన పడుతున్నారు. వేసవి తాపం కారణంగా ఎన్ని మంచినీళ్లు తాగినా దాహం తీరదు..

సూరీడు ఏమాత్రం తగ్గడం లేదు.. 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. మే నెల రాక ముందే ఉష్ణోగ్రతలు ఇలా ఉంటే.. మున్ముందు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈక్రమంలో చాలా మంది డీ హైడ్రేషన్ తో వడదెబ్బ బారిన పడుతున్నారు. వేసవి తాపం కారణంగా ఎన్ని మంచినీళ్లు తాగినా దాహం తీరదు.. దీంతో చాలామంది ఏవేవో డ్రింకులంటూ తాగుతుంటారు.. ఆ తర్వాత అనారోగ్యం పాలవుతుంటారు. ప్రస్తుత కాలంలో వడదెబ్బ, డీహైడ్రేషన్, అతిసారం లాంటి వాటికి చెక్ పెట్టాలంటే బార్లీ నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. బార్లీ గింజల్లోని పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బార్లీ వాటర్‌లో శరీర వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందించే గుణాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బార్లీ నీటిలో కాల్షియం, ఫైబర్‌, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌, కాపర్‌, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండటంటో శరీరాన్ని బోలెడన్ని ప్రయోజనాలు లభిస్తాయి.. ముఖ్యంగా వేసవిలో బార్లీ నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో.. ఇప్పుడు చూడండి..

బార్లీవాటర్​ ప్రయోజనాలు..
గుండె ఆరోగ్యం: బార్లీలో బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. బీటా-గ్లూకాన్ చెడు (LDL) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి.. మంచి (HDL) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇలా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

కడుపు సమస్యలు దూరం: వేసవిలో చాలా మంది అజిర్తీ, గ్యాస్, కడుపు సమస్యలతో బాధపడుతుంటారు.. అలాంటి వారు బార్లీ నీళ్లు తాగడం చాలా మంచిది. జీర్ణాశయం మెరుగుపడి.. అజీర్తి సమస్య దూరమవుతుంది. క‌డుపులో మంట‌, అసిడిటీ, గ్యాస్‌, అజీర్ణం, మ‌ల‌బద్ధకం ఉన్న‌వారు ఈ నీటిని తాగడం మంచిది. అంతేకాకుండా బార్లీ నీరు వ్య‌ర్థ‌ ప‌దార్థాల‌న్నీ బ‌య‌టికి వెళ్లేలా చేస్తుంది.

డీహైడ్రేషన్​ను నివారిస్తుంది: బార్లీలో పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. డీహైడ్రేషన్ సమయంలో ఈ ఎలక్ట్రోలైట్లు శరీరం నుంచి కోల్పోతాయి. కావున ఈ ఎలక్ట్రోలైట్లను భర్తీ చేయడానికి, శరీరం హైడ్రేషన్ స్థాయిలను నిర్వహించడానికి బార్లీ నీటిని క్రమం తప్పకుండా తాగాలి.

డయాబెటిస్‌లో: బార్లీ నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బీటా-గ్లూకాన్ రక్తప్రవాహంలో చక్కెరను గ్రహించడాన్ని నెమ్మదిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో స్పైక్‌లను నివారిస్తుంది. ఇంకా డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గేలా చేస్తుంది: ఆకలిని నియంత్రించే హార్మోన్లను విడుదల చేయడానికి శరీరాన్ని బార్లీ ప్రేరేపిస్తుంది. బార్లీ వాటర్ తీసుకున్నప్పుడు కడుపునిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ హార్మోన్లు జీవక్రియను పెంచి.. బరువు తగ్గడానికి దోహదం పడతాయి.

రోగనిరోధక శక్తి – ఇన్ఫెక్షన్లు: బార్లీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇంకా ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షిస్తాయి. ఇంకా అన్ని ఇన్ఫెక్షన్ల ప్రభావం నుంచి కాపాడతాయి.

బార్లీ నీరు ఎలా తయారు చేయాలి..
బార్లీని వేయించుకొని లేదా ఎండలో ఆరబెట్టి పొడి చేసుకోని నిల్వ ఉంచుకోవాలి..

ఆ తర్వాత గిన్నెలో నీళ్లు తీసుకుని.. దానిలో రెండు చెంచాల బార్లీ పొడి వేసి కలపాలి..

ఆ తర్వాత నీటిని మరిగించాలి..

ఉడికించిన నీటిని చల్లార్చి వడకట్టుకోని తాగవచ్చు.. లేకపోతే.. అలా తాగినా మంచిదే..

బార్లీ నీటిలో కొంచెం ఉప్పుతో పాటు మజ్జిగ కూడా కలుపుకుని తాగొచ్చు..