Sattu pindi in Summer: వేసవిలో సత్తు పిండితో బోలెడన్ని బెనిఫిట్స్.. ఎలా చేయాలో తెలుసుకోండి

www.mannamweb.com


చాలా మందికి సత్తు పిండి అంటే ఏంటో తెలీదు. ఈ సత్తు పిండి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందులోనూ వేసవిలో తింటే శరీరానికి మరింత మంచిది. ఇది ఒక పురాతన వంటకం. ఈ సత్తు పిండిని.. గోధుమలు, జొన్నలు, బియ్యం నుంచి తయారు చేస్తారు. ఇందులో పోషకాలు అనేవి సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజూ తగిన మోతాదులో తీసుకుంటే.. శరీరానికి చాలా మంచిది. శరీరానికి కూడా సత్తువ లభిస్తుంది. ఈ పిండి తెలంగాణ, ఏపీ, మధ్య ప్రదేశ్‌లో ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. మరి ఈ సత్తు పిండి అంటే ఏంటి? ఎలా తయారు చేస్తారు? ఇది తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
ఈ సత్తు పిండితో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. దీని వల్ల పలు రకాల వ్యాధులతో పోరాడే శక్తి మీకు లభిస్తుంది. వేసవిలో తీసుకుంటే అలసట, నీరసం దూరం అవుతాయి.

రక్త హీనత సమస్య మాయం:
సత్తు పిండిలో ఎక్కువగా ఐరన్ లభిస్తుంది. సత్తు పిండిని తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. ఐరన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. రక్తంలో ఆక్సిజన్ సరఫరాను కూడా మెరుగు పరుస్తుంది.
వెయిట్ లాస్:
వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు సత్తు పిండిని తీసుకోవచ్చు. వీటితో తయారు చేసే ఆహారాలు తీసుకుంటే.. అధిక ఆకలిని నియంత్రిస్తుంది. ఇందులో ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి కొద్దిగా తీసుకున్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అదే విధంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. తద్వారా ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

డయాబెటీస్ కంట్రోల్:
డయాబెటీస్‌తో బాధ పడేవారు కూడా సత్తు పిండిని తీసుకోవచ్చు. సత్తు పిండిలో ఉండే ఫైబర్.. షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. అంతే కాకుండా డయాబెటీస్ వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుంచి వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది.

సత్తు పిండిని ఎలా తయారు చేస్తారు:
సత్తు పిండిని వారి ప్రాంతాల బట్టి ఎవరికి నచ్చినట్టు తయారు చేస్తారు. అయితే చాలా మంది ఎక్కువగా ఇలా చేస్తారు. బెండులు, శనగలు, రాగులు, మొగ్గలు వంటి ధాన్యాలను రాత్రంతా నానబెట్టాలి. ఆ తర్వాత వీటిని బాగా ఉడికించాలి. ఉడికించిన వాటిని.. మళ్లీ ఎండబెట్టి.. పొడిగా చేయాలి. ఇప్పుడు పిండి తయారవుతుంది. దీంతో రొట్టెలు అయినా తయారు చేసుకోవచ్చు. లేదంటే రాగి జావలా ఇది కూడా తయారు చేసుకుని తాగవచ్చు.