Chiranjeevi : చిరంజీవి అందుకే రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయారు.. వైరల్ అవుతోన్న కమెడియన్ సునీల్ కామెంట్స్

www.mannamweb.com


చాలామంది సినిమాలను, రాజకీయాలను వేర్వేరుగా భావిస్తుంటారు. ఆయా రంగాలకు సంబంధించిన వ్యాఖ్యలు, ప్రస్తావనలు కూడా డిఫరెంట్‌గానే ఉంటాయి. ఒక రంగం వారు మరో రంగం వారిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ మధ్య అందుకు భిన్నంగా జరుగుతోంది. ఎందుకంటే సినీ ప్రముఖులు రాజకీయాల్లో చేరుతున్నారు. రాజకీయ నాయకులు కూడా సినీ ప్రముఖులతో కలిసి మెలిసి తిరుగుతున్నారు. దీంతో సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఇరువైపులా పరస్పర వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు కామన్ అవుతుండగా.. ఇటు రాజకీయ, అటు సినీ వర్గాలతో పాటు ప్రజల్లోనూ అవి ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాజాగా మరోసారి అలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రముఖ నటుడు, కమెడియన్ సునీల్ చిరంజీవి రాజకీయ జీవితంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఒకవైపు మెగాస్టార్ సోదరుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్నాడు. తమ్ముడికి సపోర్ట్‌గా చిరంజీవి కూడా పిఠాపురం నుంచి ఎలక్షన్ క్యాంపెన్‌లో పాల్గొంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే సందర్భంలో ప్రముఖ హాస్య నటుడు సునీల్, మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి సక్సెస్ కాలేకపోవడానికి అదే కారణమంటూ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతుండటంతో ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది.

ఇంతకీ అప్పట్లో సునీల్ ఏమన్నారంటే.. ‘‘చిరంజీవి గారిని చాలామంది పొలిటికల్‌గా సక్సెస్ కాలేదని అంటుంటారు. అది నిజమే. ఆయన సక్సెస్ కాలేదు. కానీ ఆయన వర్క్ విషయంలో మాత్రం ఆయనే టాప్. ఆయనే నెంబర్ వన్. సొంత టాలెంట్‌తోనే చిరంజీవి ఈ స్థాయికి ఎదిగారు. రాజకీయాల్లోనూ పది మందికి ఉపయోగపడాలనుకున్నారు. కానీ సక్సెస్ కాలేకపోయారు. ఒక నాయకుడి చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఒక్కరు రాంగ్ స్టెప్ వేసినా ఫలితం ఉండదు. చిరంజీవి విషయంలోనూ అదే జరిగింది. ఆయన చుట్టూ ఉన్నవారు తప్పుడు డెసిషన్స్ తీసుకోవడంవల్ల ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అదే ఆయన సక్సెస్ కాలేకపోవడానికి కారణం’’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా మెగాస్టార్‌కు, పవన్ కల్యాణ్‌కు ప్లస్ అవుతాయా? మైనస్ అవుతాయా? అనే డిస్కషన్ నడుస్తోంది.