AP Elections: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారి సంఖ్య ఎంతంటే ?

www.mannamweb.com


AP Elections 2024: ఏపీ వ్యాప్తంగా 4,44,216 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకున్నారని ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ తెలిపారు. మే 4 నుంచి 9వ తేదీ వరకు పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగిందని వెల్లడించారు.

ఆరు రోజుల పాటు జరిగిన ఓటింగ్ లో నెల్లూరు పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా 22,650 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. అత్యల్పంగా అమలాపురం పార్లమెంట్ పరిధిలో 14,526 ఓట్లు పోలయ్యాయని అన్నారు. ఇదిలా ఉంటే పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్ లకు తరలిస్తున్నారు. తూర్పు గోదావరి, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు 14 నియోజకవర్గాల్లో వందశాతం వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ముకేశ్ కుమార్ తెలిపారు.
ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో అన్ని సౌకర్యాలు కల్పించేలా 28 మోడల్ పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పల్నాడు జిల్లాతో పాటు పలు సమస్యాత్మక ప్రాంతాల్లోని ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీఈవో ఆఫీస్ తో పాటు అన్ని జిల్లాల్లోని కంట్రోల్ రూంల ద్వారా పోలింగ్ తీరును పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.