AP EAMCET Results 2024: ఏపీలో ఇటీవల ఈఏపీసెట్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే..అయితే ఇప్పటికే అధికారులు ప్రిలిమినరీ కీ కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫలితాలను ఈ రోజు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అభ్యర్థులు ఫలితాల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఫలితాలతో పాటు..కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా అధికారులు విడుదల చేసే అవకాశం ఉంది.
ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ పరీక్షలను మే 16, 17 తేదీల్లో 4 సెషన్లలో నిర్వహించారు. ఇక ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు..మే 18 నుంచి 23 వరకు 9 సెషన్లలో నిర్వహించారు. రోజుకు రెండు సెషన్లలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు రెండో సెషన్ నిర్వహించారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ మే 24న ఈ పరీక్షలకు సంబంధించిన కీ కూడా విడుదల చేశారు. అయితే అధికారులు వీటి రిజల్ట్స్ ప్రకటించనున్నారు.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ AP EAMCET యొక్క BiPC, MPC స్ట్రీమ్‌ల ఫలితాలు ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత అభ్యర్థులు తమ AP EAMCET 2024 ర్యాంక్ కార్డ్‌ని అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వారి ర్యాంక్ కార్డును యాక్సెస్ చేయడానికి, అభ్యర్థులు వారి దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి. ఫలితాల ప్రకటన తర్వాత ఆన్‌లైన్‌లో స్కోర్‌కార్డ్ లింక్‌ని యాక్టివేట్ చేస్తారు.