Telugu girls arrested in Dallas: అమెరికాలోని ఓ మాల్‌ చోరీ, తెలుగు విద్యార్థులు అరెస్ట్, ఆపై బెయిల్.. ఏమైంది?

www.mannamweb.com


Telugu girls arrested in Dallas: అగ్రరాజ్యం అమెరికా వెళ్లడానికి నానాకష్టాలు పడతారు భారతీయ విద్యార్థులు. వాళ్లు పెట్టే పరీక్షల్లో పాసవ్వడం ఒకెత్తు, ఇంకోవైపు లేనిపోని ఆంక్షలు.

కోటి ఆశలతో తమ పిల్లలను అక్కడికి పంపిస్తారు పేరెంట్స్. కనీసం జీవితంలో సెటిలవుతారని భావిస్తారు.

ఓవైపు జాబ్ చేస్తూ.. మరోవైపు చదువుకుంటారు భారతీయ విద్యార్థులు. ఈ క్రమంలో దుండగులు దాడుల్లో మరణించిన విద్యార్థులు లేకపోలేదు. తాజాగా ఇద్దరు తెలుగు విద్యార్థులు అక్కడ ఓ షాపింగ్ మాల్‌లో చోరీకి పాల్పడ్డారు.. అడ్డంగా బుక్కయ్యారు. చివరకు పోలీసులు అరెస్ట్ చేయడం తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ చోరీ వెనుక అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం.

ఒకరు మానసరెడ్డి, మరొకరు సింధూజారెడ్డి. వీళ్లిద్దరు మాంచి ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్లినా, ఏమిచేయాలన్నా ఇద్దరు కలిసే చేస్తారు. అది కష్టమైనా నష్టమైనా. అయితే డాలస్‌లోని మెకీ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. అక్కడవాళ్లకి కావాల్సిన వస్తువులను చూసి టెంప్ట్ అయ్యారు. ఎలాగైనా వాటిని సొంతం చేసుకోవాలని భావించారు. ఎవరూ చూడలేదనుకున్నారు.. సీక్రెట్‌గా చోరీ చేశారు. అసలే అగ్రరాజ్యం నిఘా ఉండకుండా ఉంటుందా? పక్కగా దొరికిపోయారు. వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు వీళ్లను అరెస్ట్ చేశారు. మళ్లీ బెయిల్‌పై బయటకు వచ్చేశారు.

ఇంతవరకు స్టోరీ బాగానే నడిచింది. పోలీసులు కంప్యూటర్‌లో వీళ్ల గురించి ఒక్కసారి క్లిక్ చేయడంతో అక్కడ మానస డేటా మొత్తం బయటపడింది. మానస గతంలోనూ చాలా చోట్ల చోరీకి పాల్పడినట్టు తేలింది. వీళ్ల ప్రవర్తన చూసిన మిగతా భారతీయు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడేకాదు ఈ ఏడాది మార్చి 19న ఇద్దరు మహిళలు ఇలాగే షాపింగ్‌లో చోరీ చేసిన విషయం తెల్సిందే.