18వ లోక్‌సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా(Om Birla) వాయిస్ ఓటు ద్వారా ఎన్నికయ్యారు. బుధవారం (జూన్ 26, 2024) జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అభ్యర్థి ఓం బిర్లా కాంగ్రెస్‌కు చెందిన కోడికున్నిల్ సురేష్ (కె సురేశ్)పై విజయం సాధించారు. అయితే మళ్లీ ప్రధాని మోదీ ఎందుకు ఓం బిర్లాను ఎంచుకున్నారు. ఆయన నేపథ్యం, ఫ్యామిలీ విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఓం బీర్లా.. ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలోఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తున్న, కనిపిస్తున్న పేరు. అసలు ఎవరీయన..? ఎందుకు రెండోసారి కూడా ఏరికోరి మరీ ఈయన్నే స్పీకర్‌గా కూర్చోబెట్టాల్సి వచ్చింది..? అంతమంది సీనియర్లు.. ఎన్నికల్లో హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్ కొట్టిన వాళ్లుండగా బిర్లాకే మోదీ ఎందుకు ఓటేశారు..? బిర్లా పొలిటికల్ బ్యాగ్రౌండ్, వ్యక్తిగత జీవితం.. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి..!
రెండోసారి..
18వ లోక్‌సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా(Om Birla) వాయిస్ ఓటు ద్వారా ఎన్నికయ్యారు. బుధవారం (జూన్ 26, 2024) జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అభ్యర్థి ఓం బిర్లా కాంగ్రెస్‌కు చెందిన కోడికున్నిల్ సురేష్ (కె సురేశ్)పై విజయం సాధించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓం బిర్లా పేరును ప్రతిపాదించగా, ప్రతిపక్షం నుంచి కె. సురేష్ పేరును ప్రతిపాదించారు. ఆ తర్వాత లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లాను ఎన్నుకోవాలన్న ప్రతిపాదన మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. దీంతో బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా రెండోసారి ఎంపికయ్యారు. గతంలో బలరాం జాఖర్ రెండుసార్లు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. చాలా మంది నాయకులు స్పీకర్ అయిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ఓం బిర్లా ఎన్నికల్లో గెలిచారు.
మోదీ ఈసారి కూడా
సుదీర్ఘ పార్లమెంటరీ అనుభవం లేకపోయినా గతంలో ఓం బిర్లా సభను నడిపిన తీరు ఎంతో ప్రశంసనీయమని చెప్పవచ్చు. నేతల మాటల తీరును బట్టి సభలో చర్యలు తీసుకోవడంలో కూడా ఓం బిర్లా మోదీ ప్రశంసలు దక్కించుకున్నారు. దీంతో మళ్లీ ప్రధాని మోదీ ఈసారి కూడా ఓం బిర్లావైపే మొగ్గుచూపారు. అయితే ఎవరీ ఓ బిర్లా, ఆయన నేపథ్యం ఎంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఓం బిర్లా రాజకీయ జీవితం?
ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటాకు చెందినవారు. కోటా బండి లోక్‌సభ స్థానం నుంచి ఆయన మూడోసారి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. బీజేపీపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ గుంజన్‌పై 41,974 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2003 నుంచి ఓం బిర్లా ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. 2003లో తొలిసారిగా కోటాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2008లో కోటా సౌత్ స్థానం నుంచి కాంగ్రెస్ నేత శాంతి ధరివాల్‌పై విజయం సాధించారు. 2013లో కోటా సౌత్ స్థానం నుంచి మూడోసారి గెలుపొందారు.
ఇప్పటి వరకు
అయితే 2014లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2019, 2024లో విజయం సాధిస్తు వచ్చారు. 2019లో బీజేపీ ఆయనను స్పీకర్‌గా చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సుదీర్ఘ పార్లమెంటరీ అనుభవం లేకపోయినా ఓం బిర్లా సభను నడిపిన తీరు ప్రశంసనీయం. ఓం బిర్లా హయాంలో ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (CAA), మూడు క్రిమినల్ చట్టాల అమలుతో సహా అనేక ముఖ్యమైన పనులు జరిగాయి. ఆయన పదవీకాలంలో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోలేదు.
ఓం బిర్లా వ్యక్తిగత జీవితం
ఓం బిర్లా 1962 నవంబర్ 23న రాజస్థాన్‌లోని కోటాలో జన్మించారు. ఆయన తండ్రి పేరు శ్రీ కృష్ణ బిర్లా, తల్లి పేరు శ్రీమతి శకుంతలా దేవి. మార్చి 11, 1991న, ఆయన డాక్టర్ అమితా బిర్లాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఆకాంక్ష, అంజలి బిర్లా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓం బిర్లా విద్యాభ్యాసం 1986లో మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయం నుంచి M.Com డిగ్రీ పూర్తి చేశారు.