పొంగలిని అమ్మవారికి నైవేద్యంగా పెడతాం, బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా చేసుకుంటాం. నెయ్యివేసి చేసిన పొంగలి టేస్టు గురించి మాటల్లో చెప్పలేము. పొంగలిని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ రోజు మీకు అందిస్తున్నాం.
చాలా సింపుల్‌గా, తక్కువ సమయంలోనే మీరు పొంగలిని చేసుకోవచ్చు.
పొంగలిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
1 కప్పు బియ్యం
ముప్పావు కప్పు పెసరపప్పు
ఉప్పు,
పావు టీ స్పూన్ మిరియాలు
3 టేబుల్ స్పూన్ల నెయ్యి
1 టీ స్పూన్ పచ్చి శెనగపప్పు
అర టీ స్పూన్ ఆవాలు
అర టీ స్పూన్ జిలకర
అల్లం ముక్కలు
3 పచ్చి మిరపకాయలు, కాజూలు
అర టీ స్పూన్ మిరియాలు
పావు టీస్పూన్ ఇంగువ
కొన్ని కరివేపాకులు
పొంగలిని తయారు చేసే విధానం
1. బౌల్‌లో 1 కప్పు బియ్యాన్ని తీసుకోవాలి.
2. ముప్పావు కప్పు పెసరపప్పును తీసుకొని ప్యాన్‌లో బాగా ఫ్రై చేయాలి.
3. బియ్యంలో పెసరపప్పు తీసుకొని రెండింటిని బాగా కడగాలి.
4. నీళ్లు పోసుకొని అరగంట వరకు నానబెట్టాలి.
5. స్టవ్‌పై బౌల్ పెట్టి అందులో 7 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి.
6. రుచికి సరిపడ ఉప్పు, పావు టీ స్పూన్ మిరియాలను వేసుకొని నీళ్లను బాగా వేడి చేయాలి.
7. నానబెట్టిన బియ్యం, పప్పులను ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించాలి.
8. కొన్ని నిమిశాల తరువాత అన్నం ఉడుకుతుంది.
9. పప్పు గుత్తితో కొంచెం స్మాష్ చేయాలి.
10. ఒక కప్పు నీళ్లను కూడా ఇందులో పోసుకోవాలి.
11. కొన్ని నీళ్లను పోసుకొని మరో 4 నిమిశాలు ఉడికించాలి.
12. స్టవ్‌పై మరో ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి.
13. నెయ్యి వేడయిన తరువాత అందులో 1 టీ స్పూన్ పచ్చి శెనగపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, 14.
14. అర టీ స్పూన్ జిలకరను యాడ్ చేసుకోవాలి.
15. సన్నగా తరిగిన అల్లం ముక్కలను, 3 పచ్చి మిరపకాయలను, కొన్ని కాజూలను, అర టీ స్పూన్ 16. మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
17. ఇందులోనే పావు టీస్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పావు 18. టీస్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి.
19. ఈ మొత్తాన్నీ ఉడుకుతున్న పొంగలిలో వేసుకోవాలి.
20. ఉడికిన అన్నం, పొంగలి పోపును బాగా కలుపుకుంటే పొంగలి రెడీ అయినట్టే.